Diabetes Medice Hydrogel : మధుమేహానికి ఏడాదికి మూడు సార్లే మందు..!
ప్రపంచంలో రోజురోజుకు షుగర్(Sugar) బారిన పడుతున్నవారు కోకొల్లలు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు(Food Habits), జన్యుపరంగా ఈ షుగర్ మానవాళికి ముప్పుగా మారింది. ఈ షుగర్ నార్మల్‌గా ఉంటే రోజుకో మాత్ర(Medicine) వేసుకుంటారు. మరీ ఎక్కువగా ఉంటే ప్రతి రోజూ ఇన్సూలిన్(Insuline) పడాల్సిందే. ఇకపై ఇన్సూలిన్ అవసరం లేదని పరిశోధకులు చెప్తున్నారు. షుగర్ కోసం కొత్తగా తయారుచేసిన మందు హైడ్రోజల్(Hydrogel). ఇది ఏడాదికి మూడు సార్లు తీసుకుంటే చాలంటున్నారు అమెరికాకు చెందిన సైంటిస్టులు.

బరువును అదుపులో ఉంచే ఒజెంపిక్, మౌంజారో, విక్జోజా, ట్రూలిసిటీ వంటి మందులకు ప్రత్యామ్నాయంగా ఈ హైడ్రోజెల్ పనిచేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. హైడ్రోజల్ నాలుగు నెలలకోసారి తీసుకుంటే ఈ మందులను దశలవారీగా(Session) మన శరీరంలోకి పంపిస్తుందంటున్నారు. నానోపార్టికల్స్‌తో(Nano Particles) కూడి ఉన్న హైడ్రోజల్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత పాలిమర్స్‌తో నానోపార్టికల్స్ అనుసంధానమై ఒక జెల్ మాదిరిగా ఏర్పడుతుందని.. ఇవి విడిపోయేందుకు వారాల సమయం పడుతుందని.. పాలిమర్, నానో పార్టికల్స్ పొర ద్వారా హైడ్రోజల్ తయారై శరీరంలోకి పంపిన మందులను ఈ పొర అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. అందుకే మనం తీసుకున్న ఔషదాలు ఎక్కువ కాలం పనిచేస్తాయన్నారు. ప్రస్తుతం ఎలుకలపై విజయవంతంగా దీనిని ప్రయోగించారు. పందులపై ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పందులపై కూడా ఈ ప్రయోగం విజయవంతమైతే.. రెండేళ్లలో మానవులపై క్లినికల్ ప్రయోగాలు చేస్తామన్నారు.