ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ (AI Technology)వినియోగం విపరీత ధోరుణులకు ఆజ్యం పోస్తోంది. ఏఐ టెక్నాలజీ పెరిగినకొద్దీ ఆన్‎లైన్‎లో(Online) అశ్లీలత కూడా అదే స్థాయిలో పెరిగినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంతో అశ్లీలత(Obscenity) విపరీతంగా పెరిగిపోయినట్టు తేలింది. కొంత మంది ఏఐని ఉపయోగించి మహిళల ఫోటోల్ని(Women photos) అశ్లీలంగా మార్చి..దాన్ని ఒక వ్యాపారంగా(Business) మారుస్తున్నారు. ఫలితంగా మహిళల ఫోటోల్ని అశ్లీలంగా చూపే యాప్ లు(Apps), వెబ్‎సైట్ లు (Websites)ప్రాచుర్యంలోకి వస్తున్నట్టు పలు నివేదికలు వెలుగులోకి తెచ్చాయి. ఆన్‎లైన్‎లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇలాంటి యాప్‎లు, వెబ్‎సైట్స్ ను చూసేందుకు యూజర్లు(Users) ఎగబడుతున్నట్టు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌ నెలలోనే 24 మిలియన్ల మంది యూజర్లు ఏఐ మహిళల ఫోటోల్ని వీక్షించేందుకు వాటిని డిజైన్‌(Design) చేసే వెబ్‌ పోర్టల్స్‌, యాప్స్‌కు పోటెత్తినట్లు సోషల్ నెట్‌వర్క్ అనాలసిస్‌ సంస్థ గ్రాఫికా(Graphica) గుర్తించింది.

ఈ ఏడాది మొదటి నుంచి యూజర్లకు సర్వీసులు అందించేలా పలు రకాల యాప్స్‌ ప్రయత్నాలు(trials) మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సోషల్‌ మీడియా(Social media) నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఏఐ అశ్లీల ఫోటోలతో యాడ్స్ ఇస్తున్నాయి. ఆ సంఖ్య 2,400 శాతానికి(2400%) చేరినట్లు తెలిపింది. వాటిల్లో ఎక్స్‌.కామ్‌తో పాటు రెడ్డిట్‌(Reddit) కూడా ఉన్నట్లు గ్రాఫికా రీసెర్చర్లు గుర్తించారు. ఏఐ నిపుణులు మహిళల ఫోటోల్ని రీక్రియేట్‌(Recreate) చేసి వాటి సాయంతో ఏఐ అశ్లీల ఫోటోల్ని తయారు చేస్తున్నారు. అనంతరం ఆ ఫోటోలతో యాప్స్‌, వెబ్‌ పోర్టల్స్‌ సర్వీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాటిపై అడ్డుకట్ట వేసేలా ఆయా ప్రభుత్వాలు(Governments), ఏఐ సంస్థలు ఆంక్షలు విధించాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మానవ జాతికి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ముప్పుగా పరిణమిస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు(warning). గూగుల్(Google), ఆక్స్‌ఫర్డ్‌కు (oxford)చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన వివరాల్ని ఏఐ మ్యాగజైన్ అనే జర్నల్‌లో(Journals) ఇటీవల ప్రచురించారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఇంకా ప్రాథమిక(Primary) దశలోనే ఉంది
ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి(Develop) చెంది, అందుబాటులోకి వస్తే అది మానవజాతి మనుగడకే ముప్పుగా మారుతుంది. అయితే, ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రూల్స్(Rules) మారిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated On 9 Dec 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story