ఎయిరిండియా విమానాల్లో ఇకపై వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఎయిరిండియా విమానాల్లో ఇకపై వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. దేశీ, విదేశీ మార్గాల్లో నడిపే పలు విమానాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దేశీయంగా విమానాల్లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు ప్రకటించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది. విమానాలు వేల అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. . వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు.