రెండు, మూడు రోజులుగా ప్రముఖ హీరోయిన్ రష్మిక మార్ఫింగ్ వీడియో(Rashmika Face Morphing Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్(Social Media Influencer)కు సంబంధించిన వీడియోను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రష్మిక మొహాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కొందరు దుండగులు.
రెండు, మూడు రోజులుగా ప్రముఖ హీరోయిన్ రష్మిక మార్ఫింగ్ వీడియో(Rashmika Face Morphing Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్(Social Media Influencer)కు సంబంధించిన వీడియోను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రష్మిక మొహాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కొందరు దుండగులు. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్(Katrina Kaif)కూడా డీప్ ఫేక్(Deep Fake) బాధితురాలే. ఆమెకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
డీప్ ఫేక్ అనే పదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది రియల్.. ఏది ఫేక్ అనేది తెలియక అయోమయం నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేసే మాయాజాలమే ఇది. సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకూ.. ఇప్పుడు ఈ కొత్త "డీప్ ఫేక్" టెన్షన్ వెంటాడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతమందిని దుర్వినియోగపరిస్తే.. మరికొంతమంది పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ డీప్‌ఫేక్ అంటే ఏంటో, దీని బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఒకప్పుడు కొన్ని టూల్స్‌తో ఒకరి బాడీకి మరొకరి ఫొటో పెట్టి మార్ఫింగ్ చేయడం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్‌తో పూర్తిగా ఫేక్ వీడియోలు చేయడం చాల సులభమైంది. ఓ వ్యక్తికి డూప్ వీడియోని నచ్చినట్లు చేయడం ఈ ఏఐతో చాలా సులభం. అయితే రియాలిటీకి దగ్గరగా వీడియోలు తీద్దామనుకున్నా నకిలీల వీడియోలను గుర్తించడం పెద్ద విషయం కాదంటున్నారు సాంకేతిక నిపుణులు.ఎవరైనా తమకు సంబంధించిన ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఫొటో కాని కనిపిస్తే ఆందోళన చెందుతుంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుందామన్న కోణంలో కూడా ఆలోచిస్తుంటారు. ఇలాంటి అసాధారణమైన నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిగా సమయం కేటాయించి దృష్టి పెడితే నకిలీ వీడియోలను గుర్తించవచ్చని చెప్తున్నారు.
కళ్ల మూమెంట్స్‌తో 'డీప్ ఫేక్' వీడియోల్ని సులభంగా గుర్తించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రియల్ వీడియోలో అయితే మనిషి మాట్లాడే మాటలు, చేతులు, కళ్ల కదలికలు ఒకే అర్ధాన్ని ఇవ్వడాన్ని గమనిస్తాం. కానీ... డీప్ ఫేక్ వీడియోలో కొంత తేడాను మనం గుర్తించే అవకాశం ఉందని.. మాటలకూ, కళ్ల కదలికలకూ పొంతన ఉండదని దీంతో నకిలీలను పట్టేసుకోవచ్చని అంటున్నారు. ఆడియోలో కూడా అసలుకు నకిలీకి తేడా కనిపెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలకు జత చేసిన ఆడియోను డీప్‌గా పరిశీలిస్తే.. ఆడియో క్వాలిటీకి, వీడియో లో ఉన్న కంటెంట్‌కు తేడాలుండడం గమనించ వచ్చంటున్నారు నిపుణులు. డీప్ ఫేక్ లో ఈ రెండూ సింక్ కావడం ఉండదని, దాదాపు అసాధ్యమని అంటున్నారు. మరో వైపు వీడియోలోని ఉన్న శరీర భాగాలకు అమర్చిన మరొకరి మొహానికి పొంతన ఉండదని చెబుతున్నారు. లావుగా ఉన్న బాడీకి సన్నగా ఉన్నవారి మొహం పెట్టడం.. సన్నగా ఉన్నవారికి లావుగా ఉన్న మొహం పెట్టడం వంటివన్నమాట. పూర్తిగా గమనించిన తర్వాత ఆ వీడియో ఫేక్ అని డౌట్ వస్తే, నిర్ధారించుకోడానికి కూడా మార్గాలున్నాయంటున్నారు సాంకేతిక నిపుణులు. అదేంటంటే గూగుల్ లో "సెర్చ్ బై ఇమేజ్" ఆప్షన్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనికోసం ఆ వీడియోని స్క్రీన్ షాట్ తీసి.. ఆ ఇమేజ్‌ని అప్ లోడ్ చేస్తే దానికి సంబంధించిన వీడియోలన్నీ కనిపిస్తాయి. సో ఏది ఒరిజినల్ ఏది డూప్లికెట్ అనేది తెలుస్తుందంటున్నారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫొటోలు అప్‌లోడ్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ కేర్‌ఫుల్‌గా చేసుకోవాలని.. అకౌంట్‌కు లాక్‌లో పెట్టుకోవడంలాంటివి చేయాలంటుని చెప్తున్నారు. నమ్మకం కుదిరినవారికే తమ ప్రొఫైల్ డీటెయిల్స్ కనపడేలా చూసుకోవాలంటున్నారు. ఉచిత వైఫై ఉన్న ప్రదేశాల్లో సోషల్ మీడియాలో లాగిన్ కాకపోవడమే మంచిదని.. అన్‌నోన్ వాట్సాప్ కాల్స్, లింక్స్ వస్తే ఓపెన్ చేయకపోడం బెటరంటున్నారు నిపుణులు.