ఇటీవల మెక్సికోలో ఏఐ ఆధారిత ఐవీఎఫ్‌ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిలో కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఒక శిశువు జన్మించింది.

ఇటీవల మెక్సికోలో ఏఐ ఆధారిత ఐవీఎఫ్‌ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిలో కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఒక శిశువు జన్మించింది. ఈ AI ఆధారిత సాంకేతికత ద్వారా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్‌ (Intracytoplasmic sperm injection)ప్రక్రియలోని 23 దశలను, అంటే స్పెర్మ్ ఎంపిక నుంచి ఇంజెక్షన్ వరకు, పూర్తిగా స్వయంచాలకంగా నిర్వహించారు. ఇది వైద్య రంగంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతోంది. వాస్తవానికి, ఈ ప్రక్రియలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ, సహాయం ఉంటాయి. కానీ IVF ప్రక్రియలోని కీలక దశలు AI ద్వారా నిర్వహించారు. ఈ సాఫల్యం మెక్సికో(Mexico)లోని వైద్యులు, సాంకేతిక నిపుణుల సమన్వయంతో సాధించిన ఒక అద్భుతమైన విజయంగా చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో స్త్రీ అండం, పురుషుడి వీర్యకణం రెండూ అవసరమే. మెక్సికో వైద్య సంఘటనలో, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(In vitro fertilization) లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో స్పెర్మ్ ఎంపిక, ఇంజెక్షన్ వంటి దశలు ఏఐ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ప్రక్రియలో స్త్రీ నుంచి అండాలను సేకరిస్తారు.. పురుషుడి నుంచి వీర్యకణాలను తీసుకుంటారు. ఆ తర్వాత, ల్యాబ్‌లో అండంలోకి వీర్యకణాన్ని ప్రవేశపెట్టి ICSI ద్వారా లేదా వాటిని కలిపి IVF ద్వారా ఫలదీకరణం జరిగేలా చేస్తారు. ఫలదీకరణం అయిన అండాన్ని స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. AI ఈ ప్రక్రియలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, స్పెర్మ్ ఎంపిక, ఇంజెక్షన్ వంటి దశలను కచ్చితంగా నిర్వహించింది.

మెక్సికోలో జరిగిన ఈ వైద్య సంఘటనలో, శిశువు పూర్తిగా ల్యాబ్‌లో పెరగలేదు. అంటే, శిశువు గర్భాశయం(Pregnancy) బయట ల్యాబ్‌లో పూర్తి స్థాయిలో పెంచలేదు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు సహాయంతో కొన్ని కీలక దశలు నిర్వహించరు. సాధారణంగా IVF/ICSIలో వీర్యకణాన్ని అండంలోకి ప్రవేశపెట్టడం మానవ ఆపరేటర్ చేతితో, మైక్రోస్కోప్ సాయంతో జరుగుతుంది. ఈ సందర్భంలో, AI ఆధారిత రోబోటిక్ సిస్టమ్ ఈ పనిని సమర్థవంతంగా చేస్తుంది. అంటే స్పెర్మ్ ఎంపిక చేయడం, దాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేయడం వంటి దశలు AI ద్వారా జరిగాయి. AI సాయంతో అండం, వీర్యకణం కలిసి ఫలదీకరణం జరిగింది, ఇది ల్యాబ్‌లోనే జరుగుతుంది. ఫలదీకరణం తర్వాత ఏర్పడిన ఎంబ్రియో స్త్రీ గర్భాశయంలోకి బదిలీ చేశారు. అక్కడ నుంచి శిశువు గర్భంలో పెరిగింది.

IVF/ICSI ప్రక్రియలోని కొన్ని సాంకేతిక దశలు మానవులతో కాకుండా AI ద్వారా జరిగాయని సూచిస్తుంది. అయితే, శిశువు పెరుగుదల గర్భాశయంలోనే జరిగింది. మెక్సికోలో ఏఐ సహాయంతో విజయవంతంగా శిశువు జన్మించడం ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాబోయే రోజుల్లో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ నూతన సాంకేతికత ఒక ఆశాకిరణం కానుంది. ఏఐ సహాయంతో సాధ్యమైన ఈ అద్భుతం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Updated On 11 April 2025 7:30 AM GMT
ehatv

ehatv

Next Story