చావు ఎప్పుడో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నా భయం ఆ కుతూహలాన్ని చంపేస్తుంటుంది.

చావు ఎప్పుడో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నా భయం ఆ కుతూహలాన్ని చంపేస్తుంటుంది. అందుకే మరణ తేదీని తెలుసుకోవడానికి జంకుతుంటారు. ఇప్పుడు ఏఐ , అదేనండి కృత్రిమ మేథస్సు మనిషి మరణాన్ని అంచనా వేస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు ఏఐ చెబితే అది మరణానికి మనం ఎంత దూరంలో ఉన్నామో చెప్పేస్తుంది. ఇందుకోసం మార్కెట్‌లో కొత్తగా యాప్‌లు వస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.

డెత్ క్లాక్ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగలదు. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ దాదాపు 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. 5.3 కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తుంది. వినియోగదారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు.. వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది.

ehatv

ehatv

Next Story