సోషల్ మీడియాలో వచ్చిన ఓ యాప్‌ను ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసిన వెంటనే ఓ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి.

సోషల్ మీడియాలో వచ్చిన ఓ యాప్‌ను ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసిన వెంటనే ఓ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీపేటకు చెందిన బొల్లంగారి వెంకటేష్(Bollamgari venkatesh) వాట్సప్ గ్రూపుల్లో వచ్చిన 'పీఎం కిసాన్ యోజన(Pm Kisan yojana) ఏపీకే' ఫైల్ పేరుతో రాగా దానిని ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేశాడు. దీంతో మొబైల్‌కి నెట్ వర్క్ బంద్ అయింది. వెంటనే కొత్త సిమ్ తీసుకొని మళ్లీ యాప్‌లు అన్ని డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఫోన్ పేలో బ్యాంక్ బ్యాలెన్స్ చూడగా జీరో బ్యాలెన్స్ కనపడింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా అకౌంట్ లో ఉన్నటువంటి రూ. 1,07,420 డబ్బులు పోయాయి. దీంతో వెంకటేష్ 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.

ehatv

ehatv

Next Story