Yuvraj Singh : యువరాజ్ ఏ మాత్రం మారలేదు.. ఐఎంఎల్లో సిక్సర్ల మోత మోగించాడు..!
ఐఎంఎల్-2025లో యువరాజ్‌సింగ్ బౌండరీల మోత మోగించాడు.

ఐఎంఎల్-2025లో యువరాజ్‌సింగ్ బౌండరీల మోత మోగించాడు. భారత మాజీ ప్లేయర్ యువరాజ్‌సింగ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 30 బంతుల్లోనే ఒక ఫోరు, ఏడు సిక్సుల సహాయంతో 59 పరుగులు చేశాడు. యువరాజ్‌సింగ్‌కు సచిన్ టెండూల్కర్ కూడా తోడుకావటంతో స్టేడియంలో బౌండరీల మోత మోగింది. సచిన్ 30 బంతుల్లో ఏడు ఫోర్లు సాయంతో 42 పరుగులు చేశాడు. దీంతో ఇండియా మాస్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సచిన్ నేతృత్వంలో ఇండియా మాస్టర్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్లు సెమీఫైనల్‌లో పోరాడాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువరాజ్ సింగ్ 30 బంతుల్లో7సిక్సులు, ఒక ఫోర్‌తక్ష 59 పరుగులు, సచిన్ టెండూల్కర్ 30 ఏడుఫోర్లతో బంతుల్లో 42 పరుగుల మెరుపు ఇన్సింగ్స్ ఆడారు. యువరాజు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. వీరికితోడు స్టువర్ట్ బిన్నీ (36), యూసుఫ్ పఠాన్ (23), ఇర్ఫాన్ పఠాన్ (19) దూకుడుగా ఆడారు. 221 పరుగుల లక్ష్య ఛేదనతో దిగిన ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం ఇండియా మాస్టర్స్ ఫైనల్‌లో పోరాడనుంది.
