2011 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌లకు ప్రత్యేకమైనది. అయితే ఆ ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్.. అనారోగ్యంతో ఉన్నప్పటికీ..

2011 వన్డే ప్రపంచకప్‌(World Cup)లో ఫైనల్‌(Final)లో శ్రీలంక(Srilanka)ను ఓడించి భారత్ ట్రోఫీ(Title)ని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni), సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar)లకు ప్రత్యేకమైనది. అయితే ఆ ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్(Yuvraj Singh).. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టును ప్రపంచ ఛాంపియన్‌(World Champion)గా నిల‌ప‌డంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(Player of the Series) కూడా ఎంపికయ్యాడు.

యువరాజ్ సింగ్ 2011 వ‌న్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. యువరాజ్ మొత్తం నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌(Player of the Match)గా ఎంపికయ్యాడు. త‌ద్వారా ప్రపంచ కప్‌లో అత్యధిక సార్లు అవార్డును గెలుచుకున్న శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా (1996), దక్షిణాఫ్రికాకు చెందిన లాన్స్ క్లూసెనర్ (1999)లను సమం చేశాడు.

2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 300కి పైగా పరుగులు చేసి.. బౌలింగ్‌లో 15 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆల్‌రౌండర్‌(All-Rounder)గా నిలిచాడు. ఐర్లాండ్‌(Ireland)తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ బ్యాట్‌తో, బాల్‌తో రాణించాడు. ఐదు వికెట్లతో పాటు 50 పరుగులు చేసి ప్రపంచకప్‌లో ఈ ఫీట్ సాధించిన‌ తొలి ఆటగాడుగా రికార్డ్(Record) సృష్టించాడు.

ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్ అస్వస్థతకు గురయ్యాడు. అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇంత జరిగినా పట్టుదలతో జట్టును విశ్వవిజేతగా నిలబెట్టాడు. ఆ తర్వాత క్యాన్సర్‌(Cancer)తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొంది.. కోలుకున్నాడు. అందుకే క్రికెట్ అభిమానులంద‌రూ.. యువ‌రాజ్ అభిమానులే అంటారు.

Updated On 21 Aug 2023 10:40 PM GMT
Yagnik

Yagnik

Next Story