India Beat West Indies 1st Test : అశ్విన్ స్పిన్ మాయ.. విండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను టీమ్ ఇండియా శుభారంభం చేసింది. వెస్టిండీస్‌పై భారత్ టెస్టు చరిత్రలో 23వ విజయం సాధించింది.

Yashasvi Jaiswal, R Ashwin star as India thrash West Indies by an innings and 141 runs
వెస్టిండీస్(Westindies)తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్(First Test)లో భారత్(India) అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. ఈ విజయంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship)ను టీమ్ ఇండియా శుభారంభం చేసింది. వెస్టిండీస్‌పై భారత్ టెస్టు చరిత్రలో 23వ విజయం సాధించింది. విండీస్‌పై ఆస్ట్రేలియా(Australia) (32), ఇంగ్లండ్(England) (31) మాత్రమే ఎక్కువ టెస్టులు గెలిచారు. న్యూజిలాండ్(Newzealand), శ్రీలంక(Srilanka) జట్లు వెస్టిండీస్‌పై తలా 22 మ్యాచ్‌లలో ఓడించారు.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 429 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 271 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీం ఇండియా మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్(Rohit Sharma) సేన సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. జులై 20 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ ట్రినిడాడ్(Trinidad)లో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal), రోహిత్ శర్మ సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ(Virat Kohli) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసిన యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్(Player of the Match) అవార్డు లభించింది.
