WWE స్టార్‌(WWE Superstar) బ్రే వ్యాట్(Bray Wyatt) క‌న్నుమూశారు. ఆయ‌న‌ వయస్సు కేవలం 36 సంవత్సరాలు. వ్యాట్ కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడించలేదు. అనారోగ్యం కారణంగా ఆయ‌న రెజ్లింగ్‌(Wrestling) కు దూరంగా ఉన్నాడు.

WWE స్టార్‌(WWE Superstar) బ్రే వ్యాట్(Bray Wyatt) క‌న్నుమూశారు. ఆయ‌న‌ వయస్సు కేవలం 36 సంవత్సరాలు. వ్యాట్ కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడించలేదు. అనారోగ్యం కారణంగా ఆయ‌న రెజ్లింగ్‌(Wrestling) కు దూరంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆకస్మికంగా మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రే వ్యాట్ మూడవ తరం రెజ్ల. మైక్ రోటుండా(Mike Rotunda) కుమారుడు. బ్లాక్‌జాక్ ముల్లిగాన్(Blackjack Mulligan) మనవడు.

ట్రిపుల్ హెచ్.. బ్రే వ్యాట్ మరణాన్ని ధృవీక‌రించాడు. WWE హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా ఇంటి నుండి ఇప్పుడే కాల్ వచ్చింది. ఆయ‌న మా WWE కుటుంబంలోని జీవితకాల సభ్యుడు బ్రే వ్యాట్(విండ్‌మ్ రోటుండా) ఈ రోజు అనుకోకుండా మరణించాడనే విచారకరమైన వార్తను మాకు తెలియజేశాడు. మా ఆలోచనలు అతని కుటుంబంతో ఉన్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆయ‌న‌ గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నామని ట్వీట్ చేశారు.

బ్రే వ్యాట్ రెండుసార్లు WWE యూనివర్సల్ ఛాంపియన్. ఒకసారి WWE ఛాంపియన్. బ్రే వ్యాట్ మాట్ హార్డీతో కలిసి ఒకసారి WWE రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు. 2019లో వ్యాట్ WWE మేల్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

బ్రే వ్యాట్ సమంతాను 2012లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. 2017లో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత‌ WWE రింగ్ అనౌన్సర్ జోజోతో కలిసి ఉన్నట్లు వెల్లడించారు. జోజో 2019 లో ఒక కొడుకు, 2020 లో మ‌రో కొడుకుకు జన్మనిచ్చింది. జోజో, బ్రే వ్యాట్ గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు.

Updated On 25 Aug 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story