WPL 2024 Ellyse Perry: ప్లే ఆఫ్‌స్ కు చేరుకున్న ఆర్‌సీబీ.. పెర్రీ విజృంభణ
ముంబై నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అద్భుతమైన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ (MI)ని ఏడు వికెట్ల తేడాతో ఓడించి, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 ప్లే-ఆఫ్‌స్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్‌పై RCB ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత UP వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ అధికారికంగా ప్లేఆఫ్ పోటీ నుండి నిష్క్రమించాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్ స్థానాలను ఖాయం చేసుకున్నాయి.
ముంబై నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(40 నాటౌట్), రీచా ఘోష్(36 నాటౌట్) బెంగళూరును గెలిపించారు. పెర్రీ(6/15) ధాటికి ముంబై 19 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. సంజీవన్ సంజన(30), మాథ్యూస్(26) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగింది. అద్భుతమైన ప్రదర్శన చేసిన పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సమిష్టి ప్రదర్శన కనబరిచింది.