ఐపీఎల్‌-2023లో 27వ మ్యాచ్ గురువారం మొహాలీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆర్సీబీ ఎలాగైనా ఈ మ్యాచ్ గెల‌వాల‌ని భావిస్తోంది.

ఐపీఎల్‌-2023లో 27వ మ్యాచ్ గురువారం మొహాలీ(Mohally)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జ‌ట్ల మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆర్సీబీ(RCB) ఎలాగైనా ఈ మ్యాచ్ గెల‌వాల‌ని భావిస్తోంది. మరోవైపు పంజాబ్(Punjab) తన చివరి మ్యాచ్‌లో గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో త‌న స్థానాన్ని మెరుగుప‌రుచుకోవాల‌ని చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జ‌రుగ‌నుంద‌ని ఇరు జ‌ట్లు భావించాయి. అయితే.. మ్యాచ్‌కి ముందే ఇరు జట్ల కెప్టెన్ల ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి.

మొహాలీలో ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం విలన్‌గా మారవచ్చ‌ని చెబుతున్నారు. ఈరోజు మొహాలీలో మేఘావృతమై ఉంటుందని అంచనా వేశారు. పంజాబ్ కింగ్స్(PK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మ్యాచ్ సమయంలో గాలి వేగం గంటకు 15 కి.మీ వేగంతో వీచే అవ‌కాశం ఉంటుంది. ఉష్ణోగ్రత 17°C నుండి 31°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ విభాగం భావిస్తోంది.

మొహాలీలోని ఐఎస్ బింద్రా పీసీఏ స్టేడియం(IS Bindra PCA Stadium)లోని పిచ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ ఫిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(shikhar Dawan) కు క‌లిసొచ్చిన మైదానం. అయితే ధావన్ గాయంపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ మ్యాచ్ ఆడగలడా లేదా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 58 ఐపీఎల్(IPL) మ్యాచ్‌లు జరగ‌గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 25, బౌలింగ్ జట్టు 33 మ్యాచ్‌లు గెలిచాయి. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఏ ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు కాలేదు.

Updated On 20 April 2023 1:17 AM GMT
Yagnik

Yagnik

Next Story