West Indies vs India : టీమిండియాతో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన విండీస్ బోర్డు
జూలై 12 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం క్రికెట్ వెస్టిండీస్ (CWI) సెలక్షన్ ప్యానెల్ 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ ద్వారా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అలిక్ అతానాజ్, కిర్క్ మెకెంజీలు అరంగేట్రం చేయనున్నారు.

WI pick Kirk McKenzie, Alick Athanaze for first Test against India
జూలై 12 నుంచి భారత్(Teamindia)తో ప్రారంభం కానున్న తొలి టెస్టు(First Test) కోసం క్రికెట్ వెస్టిండీస్ (CWI) సెలక్షన్ ప్యానెల్ 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(Kraigg Brathwaite) వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ ద్వారా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అలిక్ అతానాజ్, కిర్క్ మెకెంజీ(Kirk McKenzie)లు అరంగేట్రం చేయనున్నారు. అలిక్ అతానాజ్(Alick Athanaze) ఇప్పటివరకు 30 ఫస్ట్ క్లాస్ (ఎఫ్‌సి) మ్యాచ్‌లు ఆడి.. రెండు సెంచరీలతో సహా 1,825 పరుగులు చేశాడు. మెకెంజీకి తొమ్మిది ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో ఒక సెంచరీతో సహా 591 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికార టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ A జట్టు తరపున అతానాజ్, మెకెంజీలు ఇటీవల 220, 209 పరుగులు చేశారు. వెస్టిండీస్-ఎ 1-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
ఆల్ రౌండర్ రహ్కీమ్ కార్న్‌వాల్(Rahkeem Cornwall) మళ్లీ జట్టులోకి వస్తున్నాడు. నవంబర్ 2021లో తన చివరి టెస్టు ఆడాడు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది టెస్టుల్లో 34 వికెట్లు తీశాడు. 2019లో వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో కార్న్‌వాల్ తన అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా(South Africa) పర్యటనకు దూరమైన తర్వాత ఎడమచేతి వాటం స్పిన్నర్ జోమెల్ వారికన్(Jomel Warrican) కూడా జట్టులోకి తిరిగి వస్తున్నాడు. గాయం కారణంగా మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ అందుబాటులో లేడు. గుడాకేష్ మోతీ, జాడెన్ సీల్స్, కైల్ మేయర్స్ గాయాల సమస్యతో పునరావాసం పొందుతున్నారు.
వెస్టిండీస్ జట్టు
క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (విసి), అలిక్ అథనాజె, టాగ్నరిన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్‌కెంజీ, రామన్ రీఫర్, కెమర్ వార్క్ రోచ్, జోమెల్ రోచ్.
