Robin minj : రాబిన్ మింజ్.. ఐపీఎల్ వేలం ముగిశాక ఎక్కువగా వినపడుతున్న పేరు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. చాలా మంది యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఈ వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier Legue) 2024 మినీ వేలం(Auction) ముగిసింది. ఈ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. చాలా మంది యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఈ వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయారు. ఆ ఆటగాళ్ల జాబితాలో ఎక్కువగా వినపడుతున్న పేరు రాబిన్ మింజ్(Robin minj) 3.60 కోట్లు చెల్లించి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కొనుగోలు చేసింది.
జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన రాబిన్ మింజ్‌కు దేశవాళీ క్రికెట్(రంజీల్లో)లో ఆడే అవకాశం ఇంకా రాలేదు. రాబిన్ స్మోకీ బ్యాట్స్‌మెన్‌గా.. మంచి ఫినిషర్‌గా ప్రసిద్ధి చెందాడు. రాబిన్ ప్రతిభను మొదట ముంబై ఇండియన్స్(Mumbai Indians) గుర్తించింది. జార్ఖండ్(Jharkhand)కు చెందిన ఈ ఆటగాడు క్రికెట్(Cricket) శిక్షణ కోసం ముంబై ఇండియన్స్‌కు చెందిన శిబిరంలో చేరడానికి ఇంగ్లాండ్(England)కు వెళ్లాడు. అయితే అనూహ్యంగా వేలంలో అతడిని గుజరాత్ దక్కించుకుంది. రాబిన్ మింజ్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. వేలంలో రాబిన్‌ను దక్కించుకోవడానికి గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు సాగింది. ఈ పోరులో గుజరాత్ గెలిచి రూ.3.60 కోట్లకు రాబిన్‌ను దక్కించుకుంది.
ఐపీఎల్‌లో చేరిన తొలి గిరిజన ఆటగాడిగా రాబిన్ నిలిచాడు. రాబిన్ మింజ్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి కూడా పెద్ద అభిమాని. అతను మహేంద్ర సింగ్ ధోనిని తన క్రికెట్ ఐడల్(Cricket Idol)గా భావిస్తాడు.
గుజరాత్ తన జట్టులో ఫినిషర్ కోసం వెతుకుతోంది. రాబిన్ ఈ పాత్రను అద్భుతంగా పోషిస్తాడని జట్టు భావిస్తోంది. దీంతో ఈ ప్రామిసింగ్ ప్లేయర్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ బిడ్ వేసింది. ఐపీఎల్ వేలంలో రాబిన్ అమ్ముడుపోవడంతో అతని సొంత పట్టణంలో ఆనందం వెల్లివిరిసింది. ఐపీఎల్ 2024లో ఈ ఆటగాడు తన బ్యాటింగ్ సత్తాను యావత్ ప్రపంచానికి చూపించాలని జార్ఖండ్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.