World Richest Cricketer : ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరంటే....!
క్రికెట్ ఇప్పుడు కాస్లీ గేమ్... ఒక్కసారి లక్కు లక్కలా అతుక్కుపోయిందే అనుకోండి.. ఇక డబ్బులే డబ్బులు! ఆడినా ఆడకపోయినా కాసులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే ఇన్నేసి డబ్బులు వచ్చేవి కావు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఆర్ధిక కష్టాలను అనుభవించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఆట కాదు.. అదో ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్! దాంతో బోల్డంత బిజినెస్.. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ రూపురేఖలతో పాటు, ప్లేయర్ల అదృష్టరేఖలు కూడా మారాయి. ఇండియాలో క్రికెట్‌కే పెద్ద పీట.
క్రికెట్ ఇప్పుడు కాస్లీ గేమ్... ఒక్కసారి లక్కు లక్కలా అతుక్కుపోయిందే అనుకోండి.. ఇక డబ్బులే డబ్బులు! ఆడినా ఆడకపోయినా కాసులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే ఇన్నేసి డబ్బులు వచ్చేవి కావు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఆర్ధిక కష్టాలను అనుభవించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఆట కాదు.. అదో ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్! దాంతో బోల్డంత బిజినెస్.. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ రూపురేఖలతో పాటు, ప్లేయర్ల అదృష్టరేఖలు కూడా మారాయి. ఇండియాలో క్రికెట్‌కే పెద్ద పీట. బిజినెస్ అంతా క్రికెట్‌దే. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్నది క్రికెటే అంటే అతిశయోక్తి కాదు. సిక్సర్లు, బౌండరీలో గ్రౌండ్‌లో స్పెక్టేటర్స్‌ను ఉర్రూతలూగిస్తున్న బ్యాటర్స్ సంపాదనలో కూడా అంతే స్పీడ్ చూపిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోల సంపాదన కంటే క్రికెటర్ల సంపాదనే ఎక్కువ అట.. అద్సరే కానీ.. క్రికెట్‌లో అత్యంత ధనవంతుడుడైన క్రికెటర్ ఎవరై ఉంటారు? ఏ సచిన్ పేరో, ఏ ధోనీ పేరో చెబుతారు.. వీరిద్దరు కాకుంటే విరాట్ కోహ్లీ అయి ఉంటాడని అంటారు.. కానీ కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ అట! ఆశ్చర్యపోకండి.. సీఈవో వరల్డ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఆడమ్ గిల్‌క్రిస్ట్ నెట్ వర్త్ 380 మిలియన్ డాలర్లు అట. ఇతడితో పోలిస్తే మన సచిన్ తెందూల్కర్ సంపాదన ఎంతో లేదు.. సచిన్ నెట్‌వర్త్ 170 మిలియన్లే. ఇక మహేంద్రసింగ్ ధోనీ సంపాదన 115 మిలియన్లు అయితే, విరాట్ కోహ్లీ 112 మిలియన్ల దగ్గర ఉన్నాడు. రికీ పాంటింగ్ 75 మిలియన్లు, జాక్వెస్ కల్లిస్ 70 మిలియన్లు, బ్రియన్ లారా 60 మిలియన్లు, వీరేంద్ర సెహ్వాగ్ 40 మిలియన్లు, యువరాజ్ సింగ్ 35 మిలియన్లు, స్టీవ్ స్మిత్ 30 మిలియన్లు సంపాదించారు.