నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు బ్రిటిష్ సింగ‌ర్‌తో ల‌వ్‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌ప్తున్నాయి. ఈ గాయని పేరు జాస్మిన్ వాలియా.

నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు బ్రిటిష్ సింగ‌ర్‌తో ల‌వ్‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌ప్తున్నాయి. ఈ గాయని పేరు జాస్మిన్ వాలియా. నటాషా, హార్దిక్ ఒక నెల క్రితమే తాము విడిపోయినట్లు ధృవీకరించారు. ఇద్దరికీ అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. హార్దిక్ క్రికెట్ నుండి విరామం దొర‌క‌డంతో గ్రీస్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ హార్ధిక్‌ స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో మళ్లీ హార్దిక్ డేటింగ్ వార్తలకు ఆజ్యం పోసింది.


హార్దిక్ వీడియో పోస్టు చేయడానికి రెండు రోజుల ముందు.. జాస్మిన్ గ్రీస్‌లో తన హ‌లిడే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో.. ఆమె సరిగ్గా అదే స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి కనిపించింది. ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ మ్యాచింగ్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అభిమానులు అనుకుంటున్నారు. జాస్మిన్ కూడా హార్దిక్ వీడియోను లైక్ చేసింది. ఇది కాకుండా.. హార్దిక్ ఆమె బికినీ పోస్ట్‌పై స్పందించలేదు కానీ అంతకు ముందు చాలా పోస్ట్‌లకు స్పందించాడు.



దీంతో నెటిజ‌న్లు కామెంట్లు చేయ‌డం ప్రారంభించారు. జాస్మిన్ బికినీ ఫోటోపై ఒక నెటిజ‌న్‌.. "హార్దిక్ పాండ్యా, మీరు కలిసి ఉన్నారు. గ్రీస్‌లో కొత్త ప్రేమ పక్షులు ఆనందిస్తున్నాయి" అని వ్యాఖ్యానించారు. మరో యూజర్.. హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడు అని సరదాగా అడిగాడు. "మీరు హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తున్నారా?" అని మూడో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇవి ఊహాగానాలేనా.. ఇందులో ఏమైనా నిజ‌ముందా అనేది ఎవ‌రో ఒక‌రు స్పందించేదాకా తెలియ‌దు.

ఇదిలావుంటే.. హార్దిక్ పాండ్యా, నటాషా 2020 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు అగస్త్య 2021 లో జన్మించాడు. జూలై 2024లో ఇద్దరూ ఉమ్మడి ప్రకటన విడుదల చేసి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ కొడుకు అగస్త్యకు సహ-తల్లిదండ్రులుగా ఉంటామ‌ని చెప్పారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story