భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​సైకిల్‌ను వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో ప్రారంభించనుంది. ప్ర‌స్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలుత టెస్టు సిరీస్‌తో భారత జట్టు ప‌ర్య‌ట‌న‌ ప్రారంభం కానుంది.

భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2023-25 ​​సైకిల్‌ను వెస్టిండీస్‌(Westindies)తో రెండు టెస్టుల సిరీస్‌తో ప్రారంభించనుంది. ప్ర‌స్తుతం టీమిండియా(Teamindia) వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలుత టెస్టు సిరీస్‌తో భారత జట్టు ప‌ర్య‌ట‌న‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నేటి నుంచి 16 వరకు జరగనుంది. డొమినికా(Dominica)లోని విండ్సర్ పార్క్‌(Windsor Park)లో ఈ మ్యాచ్ జరగనుంది.

13 ఏళ్ల తర్వాత డొమినికాలో భారత్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరిసారిగా 2011లో ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు ఇక్కడ టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఇది రెండో టెస్టు. 2002 నుంచి వెస్టిండీస్‌లో భారత్ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. ఈ రికార్డును కొనసాగించడానికి భార‌త్ బ‌రిలోకి దిగుతుంది. 2002లో వెస్టిండీస్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా.. ఆరు టెస్టుల్లో గెలిచి.. ఏడింటిని డ్రా చేసుకుంది.

ఈ టెస్ట్ డీడీ స్పోర్ట్స్‌(DD Sports)లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిడి స్పోర్ట్స్ వివిధ భాషల్లో మ్యాచ్‌ను ప్రసారం చేస్తుంది. ఆన్‌లైన్‌(Online)లో ఈ మ్యాచ్‌ను జియో సినిమా(Jio Cinema), ఫ్యాన్‌కోడ్ యాప్(Fan Code APP) లో చూడవచ్చు.

ఇరు జట్లు

వెస్టిండీస్ : క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అతానాజ్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్‌కెన్‌జీ, రేమ్‌మెర్‌కన్‌జీఫ్, జోమెల్ వార్మాన్ రీఫ్,
రిజర్వ్ ఆట‌గాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, రితురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్.

Updated On 11 July 2023 10:34 PM GMT
Yagnik

Yagnik

Next Story