ఐపీఎల్-2023 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ల‌క్నో స్కోరు 19.2 ఓవ‌ర్ల‌కు 125/7 వ‌ద్ద వుండ‌గా వర్షం ఆట‌కు అంత‌రాయం క‌లిగించింది. ఆట జ‌రిగేలా లేక‌పోవ‌డంతో ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ల‌భించింది.

ఐపీఎల్-2023 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో తలపడింది. లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Stadium)లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ(Dhoni) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ల‌క్నో స్కోరు 19.2 ఓవ‌ర్ల‌కు 125/7 వ‌ద్ద వుండ‌గా వర్షం ఆట‌కు అంత‌రాయం క‌లిగించింది. ఆట జ‌రిగేలా లేక‌పోవ‌డంతో ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ల‌భించింది.

ఇదిలావుంటే.. టాస్ సమయంలో ధోనీ రిటైర్మెంట్(Retirement) గురించి ప్ర‌శ్నించ‌గా.. ఊహించ‌ని స‌మాధాన‌మిచ్చాడు. ఇదే చివ‌రి ఐపీఎల్ క‌దా మీది.. ఐపీఎల్‌ను ఆస్వాదిస్తున్నారా ధోనీని డానీ మోరిస‌న్ ప్ర‌శ్నించ‌గా.. దీనిపై మాట్లాడుతూ.. ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరు నిర్ణయించుకున్నారు. నేను అనుకోవ‌డం లేదు.. అని ఓ న‌వ్వు న‌వ్వాడు. దీంతో డానీ మోరిస‌న్(Danny Morison) ధోనీ వ‌చ్చే ఐపీఎల్ కూడా ఆడుతారంటూ ప్ర‌క‌టించాడు. ఈ సంభాష‌ణ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో 220 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు, అందులో సీఎస్‌కే 120 మ్యాచ్‌లు గెలిచింది. 90 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే జట్టు 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లోఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది.

Updated On 3 May 2023 9:08 AM GMT
Yagnik

Yagnik

Next Story