ఇక ఈ స్కోరు చేధించడానికి విండీస్ చాలానే కష్టాలు పడింది. 5 వికెట్లు కోల్పోయి
పసికూన పపువా న్యూ గినియా.. విండీస్ జట్టుకు చెమటలు పట్టించింది. మొదట ఓ మోస్తరు స్కోరు చేసిన పసికూన.. ఆ తర్వాత విండీస్ లక్ష్యాన్ని చేధించడానికి చాలా కష్టపడేలా చేసింది. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 19వ ఓవర్ వరకూ మ్యాచ్ ను తీసుకుని వెళ్లడం విశేషం. ఏది ఏమైనా పసికూన తన ఆటతో ప్రశంసలు అందుకుంటూ ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. పాపువా న్యూ గినియా ఇన్నింగ్స్ లో సెసె బావు అర్ధసెంచరీ చేశాడు. బావు 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ అసద్ వాలా 21, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కిప్లిన్ డోరిగా 27 పరుగులు చేశారు. చార్లెస్ అమిని 12, చాద్ సోపర్ 10 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఆండ్రీ రసెల్ 2, అకీల్ హోసీన్ 1, రొమారియో షెపర్డ్ 1, గుడాకేశ్ మోతీ 1 వికెట్ తీశారు.
ఇక ఈ స్కోరు చేధించడానికి విండీస్ చాలానే కష్టాలు పడింది. 5 వికెట్లు కోల్పోయి 19వ ఓవర్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్(0) డకౌటవ్వగా.. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(34), నికోలస్ పూరన్(27) పర్వాలేదనిపించారు. బ్రాండన్ కింగ్, పూరన్‌తోపాటు కెప్టెన్ పావెల్(15), రూథర్‌ఫోర్డ్(2) వికెట్లు పారేసుకోవడంతో 97 పరుగులకు కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన సమయంలో పాపువా న్యూగినియా బౌలర్లు కాస్త గతి తప్పారు. రోస్టన్ చేజ్(42 నాటౌట్)కు రస్సెల్(15 నాటౌట్) ఆఖర్లో హిట్టింగ్ చేసి విండీస్ ఖాతాలోకి రెండు పాయింట్లను చేర్చారు.