ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు సెంచరీ చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గ‌జం సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

ట్రినిడాడ్‌(Trinidad)లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌(port Of Spain)లో భారత్(India), వెస్టిండీస్(WestIndies) మధ్య రెండో టెస్టు(Second Test) మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు సెంచరీ చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రికెట్ దిగ్గ‌జం సర్ డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో సెంచ‌రీ(Century) చేసి అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 29వ సెంచరీ సాధించడం ద్వారా సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. అంతేకాదు.. టెస్టు సెంచరీలలో కోహ్లీ న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్(Kane Williams) (28), దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(Hashim Amla) (28), ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ క్లార్క్(Michel Clarke) (28)లను వెనక్కి నెట్టాడు.

ప్ర‌స్తుత‌మున్న ఆట‌గాళ్లో విరాట్ కంటే స్టీవ్ స్మిత్(Steave Smith) (32), జో రూట్(Joe Root) (30) మాత్రమే ఎక్కువ సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) (51), రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) (36 సెంచరీలు), సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) (34) భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డ‌మే కాకుండా.. విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌పై 1000 టెస్టు పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ ఏడాది అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో చివ‌రిసారి విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ సెంచరీ కోహ్లీకి 28వ టెస్టు సెంచరీ. 2019 తర్వాత 2023లో టెస్టు క్రికెట్‌లో విరాట్ సెంచరీ సాధించడం విశేషం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్ పాత ఫామ్ అందిపుచ్చుకున్నాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్‌(80), జైశ్వాల్‌(57), కోహ్లీ(121), జ‌డేజా(56) రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో రోచ్‌, వారిక‌న్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా.. హోల్డ‌ర్ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. తేజ్ నారాయ‌ణ్(33) ప‌రుగులు చేసి జ‌డేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు.

Updated On 21 July 2023 10:27 PM GMT
Yagnik

Yagnik

Next Story