Ind vs Wi Second ODI : రెండో వన్డేలో భారత్‌ను చిత్తు చేసిన విండీస్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. రెండో వన్డేలో భారత జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేక 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో 29వ సారి 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
భారత్(India), వెస్టిండీస్(Westindies) జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా(Teamindia) ఘోర ఓటమిని చవిచూసింది. రెండో వన్డేలో భారత జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేక 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో 29వ సారి 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ విషయంలో భారత్.. పాకిస్థాన్‌ను దాటేసింది.
బార్బడోస్ పిచ్‌పై కరేబియన్ బౌలర్ల ముందు ఇషాన్ కిషన్ మినహా మిగతా భారత బ్యాట్స్‌మెన్ అందరూ ఇఫలమయ్యారు. ఇషాన్ కిషన్(Ishan Kishan) అత్యధికంగా 55 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 34 పరుగులు, సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 24 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో భారత్ కేవలం 181 పరుగులకే ఆలౌటైంది. మోతే, షెఫర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసెప్ రెండు వికెట్లు నేలకూల్చాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. ఇద్దరు దిగ్గజాలకు విశ్రాంతి ఇవ్వడంతో టీమ్ ఇండియా 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఈ కారణంగానే వన్డే ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించని, క్వాలిఫయర్ రౌండ్‌లో జింబాబ్వే, స్కాట్లాండ్ వంటి జట్లతో ఓడిపోయిన వెస్టిండీస్ జట్టుపై భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో.. కెప్టెన్ షాయ్ హోప్(Shai Hope) 63 పరుగులు, కేసీ కార్తీ నాటౌట్ 48 పరుగులు చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విజయం సులువైంది. భారత్‌తో జరిగిన చివరి 10 వన్డేల్లో వెస్టిండీస్‌కు ఇది తొలి విజయం. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్(Shardul Takhur) మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఒక వికెట్ పడగొట్టారు. షాయ్ హోప్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్(Man of the Match) దక్కింది. విండీస్ ఈ విజయంతో సిరీస్1-1తో సమం చేసింది. సిరీస్‌ను తేల్చే మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియం(Brian Lara Stadium)లో జరుగుతుంది.