Australia vs Pakistan : రెచ్చిపోయిన వార్నర్, మార్ష్.. పాక్‌కు వరుసగా రెండో ఓటమి..
ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
ప్రపంచకప్(World Cup)లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) 62 పరుగుల తేడాతో పాకిస్థాన్(Pakistan)ను ఓడించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పాకిస్థాన్ 305 పరుగులకే ఆలౌటైంది. ఈ విక్టరీతో కంగారూ జట్టు టోర్నీలో రెండో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు భారత్(India)పై కూడా పాకిస్థాన్ ఓటమి చవిచూసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు మొదటి నాలుగు జట్లలోకి చేరింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్(David Warner) 163 పరుగులు, మిచెల్ మార్ష్(Mitchell Marsh) 121 లు సెంచరీలు చేయడంతో 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాకిస్థాన్ తరఫున షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) ఐదు వికెట్లు, హరీస్ రవూఫ్(Harees Rauf) మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 400 పరుగులకు చేరుకోకుండా అడ్డుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టులో ఇమామ్ ఉల్ హక్(Imam ul Haq) 70 పరుగులు, అబ్దుల్లా షఫీక్(Abdulla Shafeeq) 64 పరుగులు చేసి పాకిస్థాన్‌కు శుభారంభం అందించారు, అయితే దీని తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున ఆడమ్ జంపా(Adam Zampa) నాలుగు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ తలో రెండు వికెట్లు తీశారు. పాక్ జట్టు 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయి 62 పరుగుల తేడాతో ఓడిపోయింది.