ఐపీఎల్‌లో భాగంగా గురువారం సాయంత్రం జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్‌(IPL)లో భాగంగా గురువారం సాయంత్రం జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)ను ఓడించింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ రేసు(Playoff)లో కొనసాగుతోంది. హైదరాబాద్(Hyderabad) జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్(Toss) గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 186 పరుగులు చేసింది. స‌మాధానంగా ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

హెన్రిచ్‌ క్లాసెన్(Heinrich Klaasen) (104) సెంచరీ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 186 పరుగులు చేసింది. మిగ‌తా బ్యాట్స్‌మెన్‌ల‌లో హ్యారీ బ్రూక్‌(Harry Brook) (27) ప‌ర్వాలేద‌నిపించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో బ్రాస్‌వెల్(Bracewell) రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ఆర్‌సీబీ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ(Virat Kohli) (100) సెంచరీ సాధించాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Fap Du Plessis) కూడా 71 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్‌(Natarajan), భువ‌నేశ్వ‌ర కుమార్‌(Bhuvaneshwar Kumar)లు చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకునే అవ‌కాశం ఉంది.

Updated On 18 May 2023 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story