2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జ‌రిగిన‌ 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది.

2023 వన్డే ప్రపంచకప్‌(World Cup)లో భాగంగా జ‌రిగిన‌ 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌(Bangladesh)పై టీమిండియా(Teamindia) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లకు 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయ‌గా.. భారత్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

బంగ్లాదేశ్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంత‌రం భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ సిక్స్‌(Six)తో కోహ్లీ వన్డే క్రికెట్‌లో 48వ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.

బంగ్లాదేశ్ తరఫున లిటన్ దాస్(Litton Das) అత్యధికంగా 66 పరుగులు చేశాడు. తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించాడు. చివర్లో మహ్మదుల్లా 46 పరుగుల విలువైన ఇన్నింగ్సు ఆడి స్కోరును 250 పరుగులకు చేరువ చేశాడు. మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడు ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా త‌లా రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

భారత్ తరఫున విరాట్ కోహ్లి అజేయంగా 103 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 53 పరుగులు, రోహిత్ శర్మ(Rohit Sharma) 48 పరుగులు చేశారు. లోకేష్ రాహుల్(Lokesh Rahul) కూడా 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ తరఫున మెహదీ హసన్ రెండు వికెట్లు, హసన్ మహమూద్ ఒక వికెట్ తీశారు. భారత్‌ తదుపరి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. రెండు జట్లూ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్లు భారత్‌, న్యూజిలాండ్‌ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 22న జరగనున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపనుంది.

Updated On 19 Oct 2023 8:34 PM GMT
Yagnik

Yagnik

Next Story