లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా కనిపించాడు. మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్‌తో వాగ్వాదానికి దిగి.. మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌తో కూడా గొడవపడ్డాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించార‌ని దోషులుగా తేల్చింది బీసీసీఐ. అంతేకాదు.. గంభీర్, కోహ్లిలకు పూర్తి మ్యాచ్ ఫీజు జరిమానా విధించగా, నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)
మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎంతో దూకుడుగా కనిపించాడు. మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్‌(Naveen ul Haq)తో వాగ్వాదానికి దిగి.. మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)తో కూడా గొడవపడ్డాడు. ఈ ముగ్గురు ఐపీఎల్(IPL) నిబంధనలను ఉల్లంఘించార‌ని దోషులుగా తేల్చింది బీసీసీఐ. అంతేకాదు.. గంభీర్, కోహ్లిలకు పూర్తి మ్యాచ్ ఫీజు(Match Fee) జరిమానా విధించగా, నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

ఐపీఎల్ మీడియా ప్రకటనలో "భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం(Ekana Cricket Stadium)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌కు 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది. విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం గంభీర్ లెవెల్ 2 నేరాన్ని అంగీకరించాడు. అలాగే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి కూడా మ్యాచ్ ఫీజు 100 శాతం జరిమానా విధించినట్లు.. కోహ్లీ త‌ప్పును ఒప్పుకున్న‌ట్లు ప్రకటన పేర్కొంది. ల‌క్నో బౌల‌ర్‌ నవీన్-ఉల్-హక్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

మ్యాచ్ తర్వాత కోహ్లీ(Kohli), గంభీర్(Gambhir) మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ మిశ్రా(Amit Mishra), ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf Du Plessis), ల‌క్నో అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా(Vijay Dahiya) వారించే ప్ర‌య‌త్నం చేశారు. మ్యాచ్ అనంతరం కరచాలనం సందర్భంగా కూడా నవీన్-ఉల్-హక్, కోహ్లీ గొడవపడ్డారు.

లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో స్టంప్‌ల వెనుక నుంచి విరాట్ పరుగున వచ్చి నవీన్‌కి ఏదో సైగ చేయడంతో మొత్తం వ్యవహారం మొదలైంది. దీనిపై ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన నవీన్‌ కూడా అతని దగ్గరికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదన సమయంలో విరాట్ తన షూ వైపు చూపాడు. హోదా గురించి మాట్లాడుతున్నట్లుగా షూ నుండి బురదను తొలగించాడు. ఆర్సీబీ జ‌ట్టులోని దినేష్ కార్తీక్(Dinesh Karthik).. నవీన్ ఉల్ హ‌క్‌ను, అంపైర్ కోహ్లీని ప‌క్క‌కు తీసుకెళ్ళారు. నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న లక్నోకు చెందిన అమిత్ మిశ్రా, కోహ్లీని శాంతింపజేయడానికి ప్రయత్నించగా.. విరాట్ కోపంగా రెచ్చిపోయాడు.

బెంగళూరు విజయం తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసే స‌మ‌యంలో.. నవీన్‌తో కరచాలనం చేస్తూ కోహ్లీ ఏదో అన్నాడు. కోహ్లి మాట‌ల‌కు నవీన్ కూడా ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కోహ్లీ బౌండరీ వెంబడి నడుస్తూ.. లక్నోకు చెందిన కైల్ మేయర్స్‌తో మాట్లాడటం ప్రారంభించాడు. ఇంతలో గంభీర్ వచ్చి మేయర్స్‌ని తీసుకెళ్లి కోహ్లీతో మాట్లాడవ‌ద్ద‌ని అడ్డుకున్నాడు. దీని తర్వాత గంభీర్ త‌న‌ను ఏదో అన్నాడ‌ని.. కోహ్లీ అతనిని దగ్గరకు పిలిచి మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. అనంత‌రం కోహ్లీ, లోకేష్ రాహుల్ మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఇదంతా ప్రొపేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా.. అల్ల‌రి మూక‌ల గొడ‌వ‌ను త‌ల‌పించింది. మ్యాచ్ అనంత‌రం ప్రేక్ష‌కులు గొడ‌వ‌ను కూడా చూస్తూ ఎంజాయ్ చేశారు.

Updated On 1 May 2023 11:10 PM GMT
Yagnik

Yagnik

Next Story