Virat Kohli : ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డ్.. ఏకంగా బ్యాటింగ్‌లో 100 సార్లు..
అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెట్టాడంటే ఏదో ఒక రికార్డు సృష్టిస్తాడు. కోహ్లీ గురువారం 229వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి మరోసారి ఆర్సీబీకి గొప్ప ఆరంభాన్ని అందించాడు.
అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా.. రన్ మెషీన్(Run Machine) విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో అడుగుపెట్టాడంటే ఏదో ఒక రికార్డు సృష్టిస్తాడు. కోహ్లీ గురువారం 229వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి మరోసారి ఆర్సీబీ(RCB)కి గొప్ప ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే.. తన ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేయగానే.. ఐపీఎల్‌లో కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్(IPL) చరిత్రలో 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు 100 సార్లు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఎక్కువసార్లు 30 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ ఇప్పటికే అందరికంటే ముందున్నాడు. మొత్తం 229 ఐపీఎల్ మ్యాచ్‌లలో 100 ఇన్నింగ్సులలో 30 కంటే ఎక్కువ పరుగులు చేయడం కోహ్లీ నికలడకు నిదర్శనమని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో విరాట్ ఇప్పటివరకు 48 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు, 30 పరుగుల సంఖ్యను 47 సార్లు టచ్ చేశాడు. ఐపీఎల్‌లో 91 సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి శిఖర్ ధావన్(Shikhar Dhawan).. ఈ జాబితాలో విరాట్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత డేవిడ్ వార్నర్-90, రోహిత్ శర్మ-85, సురేష్ రైనా-77 సార్లు 30 కంటే ఎక్కువ పరుగులు చేసిన వారి జాబితాలో టాప్-5 లో ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ(48).. డేవిడ్ వార్నర్(David Warner) తర్వాత స్థానంలో ఉన్నాడు. వార్నర్ 58 అర్ధ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో క్రిస్ గేల్(Chris Gayle) (6 సెంచరీలు) మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లీ 5 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 4 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.