భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ విజ్ఞప్తిపై స్పోర్ట్స్ కోర్ట్ మంగళవారం నిర్ణయం వెలువరించనుంది.

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ విజ్ఞప్తిపై స్పోర్ట్స్ కోర్ట్ మంగళవారం నిర్ణయం వెలువరించనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో జపాన్‌కు చెందిన యుయి సుసాకితో సహా మూడు విజయాలతో వినేష్ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో తలప‌డాల్సివుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఆమె బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడింది, దీని కారణంగా ఆమెపై అనర్హత వేటుపడింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఆగస్టు 13న నిర్ణయాన్ని ప్రకటించాలని స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ నిర్ణయించింది.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వినేష్ గత బుధవారం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసింది. ఆమెకు క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి ఉమ్మడి రజత పతకాన్ని ప్రదానం చేయాలని డిమాండ్ చేసింది. లోపెజ్ సెమీ-ఫైనల్స్‌లో వినేష్ చేతిలో ఓడిపోయింది. అయితే వినేష్‌ అనర్హతతో ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. అనర్హత వేటు వేసిన ఒక రోజు తర్వాత.. వినేష్‌ రిటైర్మెంట్ ప్రకటించింది.

పారిస్ ఒలింపిక్స్ ముగిసిన నేప‌థ్యంలో వినేష్ గేమ్స్ విలేజ్ నుండి బయలుదేరింది. నివేదికల ప్రకారం.. ఆమె మంగళవారం ఇంటికి చేరుకుంటుంది. వినేష్ క్రీడా గ్రామాన్ని వీడిన‌ వీడియో బయటకువ‌చ్చింది. ఆమె సోమవారం పారిస్ నుండి భారతదేశానికి బయలుదేరి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తుంది.

వినేష్‌కు మద్దతిచ్చే క్రీడా ప్రముఖుల జాబితాలో జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ రీ హిగుచి కూడా ఉన్నారు. అతను మూడేళ్ల క్రితం టోక్యోలో ఇదే విధంగా అనర్హుడయ్యాడు.. కానీ పారిస్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. వెటరన్ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ బరోస్ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని వినేష్‌కు రజత పతకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వినేష్‌కి కనీసం రజత పతకమైనా వచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, ప్రఖ్యాత హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేష్ కూడా వినేష్‌కు మద్దతుగా నిలిచారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story