Vinesh Phogat India Return : భారత గడ్డపై అడుగుపెట్టిన వినేష్.. కన్నీళ్లను ఆపుకోలేక..
పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ శనివారం విమానాశ్రయానికి చేరుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ శనివారం విమానాశ్రయానికి చేరుకుంది. పతకం సాధించాలనే కల చెదిరిపోయిన తరువాత నేడు వినేష్ భారత గడ్డపై అడుగు పెట్టింది. వినేష్ ఫోగట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగింది. అయితే.. వినేష్ ఫోగట్ రాకకై భారీ సంఖ్యలో రెజ్లర్లు వేచి ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో దిగిన ఆమెకు వారంతా ఘన స్వాగతం పలికారు. అయితే.. వినేష్ మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. వినేష్ ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | Indian wrestler Vinesh Phogat breaks down as she arrives at Delhi's IGI Airport from Paris after participating in the #Olympics2024Paris. pic.twitter.com/T6LcZzO4tT
— ANI (@ANI) August 17, 2024
పారిస్ ఒలింపిక్స్ 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు ఆమె అనర్హత వేటుకు గురైంది. మ్యాచ్ రోజు ఉదయం అధికారికంగా ఆమె బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెజ్లర్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWI), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CSA)ని ఆమె ఆశ్రయించింది. రజత పతకం ఇవ్వాలని కోరింది. అయితే బుధవారం CAS ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆమె ఇండియా పయనమయ్యారు.