హరారే మైదానంలో నెదర్లాండ్స్ స్టార్ ఆల్ రౌండర్ లోగన్ వాన్ బీక్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ప్రదర్శన కనబరిచాడు. దీంతో సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. వాన్ బీక్ మొదట బ్యాట్ తో జాసన్ హోల్డర్‌ను చీల్చి చెండాడు. ఏకంగా ఆరు బంతుల్లో 30 పరుగులు చేశాడు.

హరారే మైదానం(Harare Stadium)లో నెదర్లాండ్స్(Netherlands) స్టార్ ఆల్ రౌండర్ లోగన్ వాన్ బీక్(Logan van Beek) క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ప్రదర్శన కనబరిచాడు. దీంతో సూపర్ ఓవర్‌(Super Over)లో వెస్టిండీస్ జట్టు(West Inides) నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. వాన్ బీక్ మొదట బ్యాట్ తో జాసన్ హోల్డర్‌ను చీల్చి చెండాడు. ఏకంగా ఆరు బంతుల్లో 30 పరుగులు చేశాడు. అనంత‌రం బంతితోనూ విధ్వంసం సృష్టించాడు. వాన్ బీక్ బౌలింగ్ దాటికి సూపర్ ఓవర్‌లో కరీబియన్ బ్యాట్స్‌మెన్‌ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయ‌డం విశేషం.

జాసన్ హోల్డర్ సూపర్ ఓవర్‌లో కరీబియన్ జట్టు త‌రుపున‌ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వాన్ బీక్ నెదర్లాండ్స్ త‌రుపున‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. హోల్డర్ చేతి నుండి వచ్చిన మొదటి బంతిని బౌండ‌రీకి పంపాడు. దీని తర్వాత రెండో బంతికి సిక్స్, మూడో బంతికి ఫోర్‌, నాలుగో బంతికి మరో సిక్స్, ఐదో బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ కొట్టి సూపర్ ఓవర్ ముగించాడు. దీంతో ఓవర్‌లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. వెస్టిండీస్ మ్యాచ్‌ గెలవాలంటే 31 పరుగులు చేయాల్సి ఉంది.

అనంత‌రం కరేబియన్ జట్టు ఓపెన‌ర్‌ జాన్సన్ చార్లెస్(Johnson Charles) సిక్సర్‌తో సూప‌ర్ ఓవ‌ర్‌ ప్రారంభించాడు. వాన్ బీక్ తర్వాతి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో చార్లెస్ తన వికెట్ కోల్పోయాడు. తదుపరి బంతికి హోల్డర్ కూడా ఔట‌య్యాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో మూడో సూపర్ ఓవర్ మ్యాచ్‌ను నెదర్లాండ్స్ జట్టు నెగ్గింది.

అంత‌కుముందు నెదర్లాండ్స్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాలి. వెస్టిండీస్‌కు చెందిన అల్జారీ జోసెఫ్(Alzarri Joseph) చేతిలో బంతి ఉంది. జోసెఫ్ వేసిన తొలి బంతికే వాన్ బీక్ ఫోర్ కొట్టాడు. దీంతో నెదర్లాండ్స్‌కు విజ‌యంపై ఆశలు చిగురించాయి. చివరి ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి ఉంది. అయితే జోసెఫ్ తర్వాతి ఐదు బంతుల్లో రెండు వికెట్లు సహా నాలుగు పరుగులు ఇవ్వ‌డంతో స్కోరు సమం అయ్యింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(Nicholas Pooran) (104) సెంచరీ న‌మోదు చేసుకున్నాడు. సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన‌ నెదర్లాండ్స్ జ‌ట్టులో తేజ నిడమనూరు(Teja Nidamanuru) (111 పరుగులు) అద్భుత బ్యాటింగ్ చేయ‌డంతో 9 వికెట్లు కోల్పోయి 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 374 ప‌రుగులు చేసి స్కోరు స‌మం చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

Updated On 26 Jun 2023 11:01 PM GMT
Yagnik

Yagnik

Next Story