ఐపీఎల్‌-2023 47వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (SRH vs KKR) జ‌ట్ల‌ మధ్య జరిగింది. హైదరాబాద్‌పై కేకేఆర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన‌ హైదరాబాద్ 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐపీఎల్‌-2023 47వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (SRH vs KKR) జ‌ట్ల‌ మధ్య జరిగింది. హైదరాబాద్‌(Sunrisers Hyderabad)పై కేకేఆర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా(Kolkata Knight Riders) 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన‌ హైదరాబాద్ 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు పేలవమైన ఆరంభం లభించింది. రెండో ఓవర్‌లోనే గుర్బాజ్(Gurbaz) సున్నా స్కోరు వద్ద ఔటయ్యాడు. జాసన్ రాయ్ కూడా 20 పరుగులు చేసి ఔటయ్యాడు. వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer) 7 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఆ తర్వాత రింకూ సింగ్(Rinku Singh), కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana) మధ్య 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రింకూ సింగ్ 46, కెప్టెన్ నితీశ్ రాణా 42 పరుగులు, రస్సెల్(Andrew Russel) 24 పరుగులు చేశారు. హైదరాబాద్ తరఫున జాన్సెన్, నటరాజన్(natarajan) చెరో రెండు వికెట్లు తీశారు.

లక్ష్యాన్ని ఛేదనకు దిగిన‌ హైదరాబాద్ ఆరంభంలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) కూడా 9 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ త‌ర్వాత‌ కెప్టెన్ మార్క్‌రామ్‌(41), హెన్రీ క్లాసెన్(36) ఇరువురు క‌లిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని న‌మోదుచేశారు. కోల్‌కతా తరఫున శార్దూల్ ఠాకూర్(Shardhul Takur), వైభవ్ అరోరా(Vaibhav Arora) రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో కేకేఆర్(KKR) ప్లేఆఫ్ ఆశల‌ను సజీవంగా ఉంచుకుంది.

Updated On 4 May 2023 8:14 PM GMT
Yagnik

Yagnik

Next Story