ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 1983, 2011 ఫైనల్స్‌లో కూడా టాస్ ఓడిన తర్వాతే టీమ్ ఇండియా విజయం సాధించింది.

అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మి పాల‌య్యింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లు ఆడిన టీమిండియా అన్ని వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. బ‌దులుగా ఆస్ట్రేలియా 43 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. భార‌త జ‌ట్టులో కెప్టెన్ రోహిత్‌(47), కోహ్లీ(54), కేఎల్ రాహుల్‌(66) ప‌రుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మ్యాక్స్‌వెల్ ఒక‌టి, స్టార్క్ మూడు, హేజిల్‌వుడ్ రెండు, పాట్ క‌మ్మిన్స్ రెండు, జంపా ఒక‌టి చొప్పున వికెట్లు తీశారు.

అనంత‌రం ఛేద‌న‌కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఆదిలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. ఓపెన‌ర్‌ డేవిడ్ వార్న‌ర్‌(7), మిచెల్ మార్ష్‌(15), స్టీవ్ స్మిత్‌(4) ఆదిలోనే పెవిలియ‌న్ చేరారు. అయితే మ‌రో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌(137), ల‌బుష‌న్‌(58) ఇద్ద‌రూ భార‌త్ నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. త‌ద్వారా ఆర‌వ‌సారి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్ సాధించారు. టీమిండియా బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు, ష‌మీ, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Updated On 19 Nov 2023 10:40 AM GMT
Yagnik

Yagnik

Next Story