Asia Cup : ఇప్పటికీ ఆ రికార్డ్ సచిన్ పేరిటనే ఉంది.. ఈసారి రో'హిట్' అధిగమించేనా..?
ఆసియాకప్ చరిత్రలో భారత బ్యాట్స్‌మెన్‌లు విశేషంగా రాణించారు. ఆ కారణంగానే టీమిండియా ఏడుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆగస్టు 30న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్‌ల గురించి తెలుసుకుందాం.
ఆసియాకప్(Asia Cup) చరిత్రలో భారత బ్యాట్స్‌మెన్(Indian Batsman)లు విశేషంగా రాణించారు. ఆ కారణంగానే టీమిండియా(TeamIndia) ఏడుసార్లు టైటిల్(Title)ను కైవసం చేసుకుంది. ఆగస్టు 30న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్‌ల గురించి తెలుసుకుందాం.
1. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)
ఆసియా కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు ఆడిన సచిన్.. 51 సగటుతో 971 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
2. రోహిత్ శర్మ(Rohit Sharma)
ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 21 ఇన్నింగ్స్‌లలో 46 సగటుతో 745 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ ఏకైక సెంచరీ సాధించాడు. ఆరు అర్ధసెంచరీలు కూడా రోహిత్ ఖాతాలో ఉన్నాయి.
3. ధోనీ(Dhoni)
ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మహి 16 ఇన్నింగ్స్‌ల్లో 648 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో ధోనీ పేరిట ఒక సెంచరీ.. మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
4. విరాట్ కోహ్లీ(Virat Kohli)
ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. టోర్నీలో ఆడిన మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 61 సగటుతో విరాట్ 613 పరుగులు చేశాడు. కింగ్ కోహ్లి పేరిట మూడు సెంచరీలు, ఒక అర్ధశతకం ఉన్నాయి.
5. గౌతమ్ గంభీర్(Gautham Gambhir)
గౌతమ్ గంభీర్ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత జట్టులో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ టోర్నీలో మొత్తం 573 పరుగులు చేశాడు. గంభీర్ పేరిట ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి.