IPL 2024 : సోఫాలో చెరో పక్క కూర్చున్న రోహిత్, హార్దిక్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన అభిమానులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ క్రికెటర్లందరితో పాటు జట్టు యజమాని నీతా అంబానీ, మెంటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. వీడియో చివరిలో సోఫాలో చెరో పక్క కూర్చున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు టీమ్ ఫోటోకి పోజులిచ్చారు. ఫోటోలో ఇరువురు సీరియస్‌గా చూస్తున్నారు. ఇప్పటికే రోహిత్ స్థానంలో హార్దిక్‌ని కెప్టెన్‌గా చేయడం తెలిసిందే. ఆ వివాదం తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ధిక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రకరకాల మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇద్దరి మధ్య అంత దూరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై హార్దిక్ కూడా స్పందించాడు.
Har dhadkan, har dil ye bole 𝙈𝙪𝙢𝙗𝙖𝙞 𝙈𝙚𝙧𝙞 𝙅𝙖𝙖𝙣 🎶💙#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/Z911mvKOI1
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
ఐపీఎల్ 2024లో రోహిత్‌కు తనకు మధ్య వింత ఏమీ కనిపించడంలేదని హార్దిక్ పాండ్యా తన ప్రకటనలో పేర్కొన్నాడు. తనకు, హిట్‌మ్యాన్‌కు మధ్య సంబంధంలో ఎటువంటి చీలిక లేదని.. రోహిత్ తన అనుభవాన్ని ఉపయోగించుకుంటాడని.. సీజన్ అంతటా తనకు మద్దతు ఇస్తాడని హార్దిక్ చెప్పాడు.
ముంబై కొత్త కెప్టెన్ ఇలా అన్నాడు.. ఏమీ భిన్నంగా ఉండదు. నాకు అతని సహాయం అవసరమైతే.. అతను ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. అంతేకాదు రోహిత్ భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు కాబట్టి దీని వల్ల నాకు చాలా ప్రయోజనం ఉంటుంది. అతను ఈ ముంబై జట్టుతో చాలా సాధించాడు. ఆ విజయాలను ముందుకు తీసుకెళ్లడానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇది విచిత్రంగా లేదా భిన్నంగా ఉంటుందని నేను అనుకోను. మేము 10 సంవత్సరాలుగా ఆడుతున్నాము కాబట్టి ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. నేను అతని కెప్టెన్సీలో నా కెరీర్ మొత్తం ఆడాను. సీజన్ అంతా రోహిత్ నా వెన్నంటి ఉంటాడని పేర్కొన్నాడు.
కెప్టెన్సీ మార్పు తర్వాత కోపంతో ఉన్న అభిమానులకు సంబంధించి హార్దిక్ ఒక ప్రకటన ఇచ్చాడు.. వారి నుండి కూడా మద్దతు అవసరం అని చెప్పాడు. అభిమానులు తమ నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హార్దిక్ 'అవును, నేను బౌలింగ్ చేస్తాను. నిజం చెప్పాలంటే, మేము అభిమానులను చాలా గౌరవిస్తాము, కానీ అదే సమయంలో మేము మా ఆటపై దృష్టి పెట్టాలి. నేను అవసరమైన వాటిపై దృష్టి పెట్టను. నేను నియంత్రణలో ఉన్న విషయాలను నియంత్రిస్తాను. నేను నియంత్రించలేని వాటిపై దృష్టి పెట్టను. అదే సమయంలో మేము అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు.