Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్‌పై సంక్షోభ మేఘాలు.! నేటి మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కేనా..?
ఐపీఎల్-2023లో ఈరోజు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను కైవసం చేసుకోగా.. ఈ ఏడాది కూడా టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తుంది. మంబై ఇండియన్స్ మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఏడవ స్థానంలో ఉంది. ముంబై తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ టెండూల్కర్.

Today Mumbai Indians Match.. Will Arjun Tendulkar Play Today
ఐపీఎల్-2023లో ఈరోజు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో తలపడనుంది. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను కైవసం చేసుకోగా.. ఈ ఏడాది కూడా టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తుంది. మంబై ఇండియన్స్ మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఏడవ స్థానంలో ఉంది. ముంబై తరుపున ఐపీఎల్ ఎంట్రీ(IPL Entry) ఇచ్చాడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar). తొలి రెండు మ్యాచ్‌ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి.. మూడవ మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ ప్లేయింగ్ ఎలెవన్(Playing XI)లో చోటు దక్కించుకుంటాడా.? అనేది రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద ప్రశ్న.
పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన చివరి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ మొదటి రెండు ఓవర్లు బాగానే వేసినా.. మూడో ఓవర్‌లో మాత్రం 31 పరుగులు పరుగులిచ్చాడు. అర్జున్ టెండూల్కర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(Prabsimran Singh) వికెట్ తీశాడు. అయితే.. హర్‌ప్రీత్ భాటియా(Harpreeth Batia), సామ్ కరణ్(Sam Curran) మాత్రం అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ను చీల్చిచెండడారు. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఏ బౌలర్ కూడా ఒకే ఓవర్‌లో ఇన్ని పరుగులు ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదు. మ్యాచ్ గతిని మార్చిన ఓవర్ ఇది. ఒత్తిడిలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఈ ఓవర్‌తో స్వేచ్ఛగా ఆడటం ప్రారంభించింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఓడిపోయింది.
దీంతో రోహిత్ శర్మ.. ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు అర్జున్ ను కొనసాగించాలా.. మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలా అనే విషయమై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అర్జున్ టెండూల్కర్ ను పక్కకు పెడితే కొంత ఒత్తిడికి లోనవుతాడు. మరొక అవకాశం ఇస్తే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే మరోమారు విఫలమైతే ఓటమి ప్రభావం మొత్తం జట్టు మీద పడుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నిర్ణయం కీలకం కానుంది. ముంబై ఇండియన్స్ వరుస పరాజయాల తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి విజయాల పరంపరను ప్రారంభించింది. సగం మ్యాచ్‌లు అయిపోయిన నేపథ్యంలో రిస్క్ ఎందుకంటూ ముంబై అభిమానులు సైతం సూచనలు చేస్తున్నారు.
