దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో జ‌రిగిన‌ టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.

దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) సారథ్యంలోని టీమిండియా(Teamindia) వన్డే ప్రపంచకప్(World Cup) తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో జ‌రిగిన‌ టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు వరుసగా రెండో టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో యువ జట్టు దక్షిణాఫ్రికా(South Africa)లో అడుగుపెట్టింది. గాయపడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) IPL ప్రారంభం వరకు దూరంగా ఉండ‌నున్నాడు. మరోవైపు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bhumra) కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇది కాకుండా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)ల టీ20 భవిష్యత్తుపై క్లారిటీ లేకపోవడంతో దక్షిణాఫ్రికాలో టీమిండియా విజయం కీల‌కం కానుంది.

జనవరి మధ్యలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా సిరీస్ భారత్‌కు చివరి అతిపెద్ద అంతర్జాతీయ టీ20 సిరీస్. టీ20 సిరీస్ కోసం బీసీసీఐ 17 మంది ఆటగాళ్లను ఎంపిక‌చేసింది. వారిలో ముగ్గురు మాత్రమే శ్రేయాస్ అయ్యర్, ముఖేష్ కుమార్, ఇషాన్ కిషన్ వ‌న్డే ఫార్మాట్‌లో భాగంగా ఉన్నారు. యశస్వి బ్యాటింగ్‌ను ఇప్పటికే చూపించాడు. శుభమాన్ గిల్ అన్ని ఫార్మాట్లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే రితురాజ్ గైక్వాడ్‌ను విస్మరించడం కూడా కష్టం. సమస్య ఏమిటంటే జైస్వాల్, గిల్, గైక్వాడ్ త్రయం బ్యాటింగ్ చేస్తే.. నాలుగు, ఐదు స్థానాల్లో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నారు.

వికెట్ కీపర్ స్థానం కోసం పోటీప‌డుతున్న ఇషాన్‌ కిషన్.. జితేష్ శర్మ నుండి కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే అతడు ఆరవ నంబర్‌లో 'ఫినిషర్'గా మెరుగుపడుతున్నాడు. మార్కో జెన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిల్ ఫెలుక్వాయోలను ఎలా ఎదుర్కొంటార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఇషాన్‌ను తీసుకుంటే జితేష్‌కు అవకాశం లభించదు. ఎందుకంటే ఇద్దరూ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లు. అటువంటి పరిస్థితిలో రింకూ సింగ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం ద‌క్కుతుంది. రుతురాజ్, జైస్వాల్, రింకు, జితేష్ వంటి ఆటగాళ్లకు ద‌క్షిణాఫ్రికా పిచ్‌ల‌ అదనపు బౌన్స్ అస‌లైన సవాలుగా మారింది.

దక్షిణాఫ్రికా ప్రధాన ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడకు విశ్రాంతి ఇవ్వగా.. అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్‌గిడి గాయపడ్డారు. క్వింటన్ డి కాక్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. కానీ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, మాథ్యూ బ్రిట్జ్కే భారత బౌలర్లను ఇబ్బంది పెట్టగలరు. ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్, ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నాడు. మరొక స్పిన్నర్ 'గూగ్లీ' స్పెషలిస్ట్ రవి బిష్ణోయ్ కూడా సిరీస్‌లో కీల‌కం కానున్నాడు. దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్‌-11 ఆట‌గాళ్లు..

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రిట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండ్రీ బెర్గర్, తబ్రైజ్ షమ్సీ.

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

Updated On 9 Dec 2023 11:55 PM GMT
Yagnik

Yagnik

Next Story