Mumbai Indians Beat Rajasthan Royals : యశస్వి జైస్వాల్ సెంచరీ వృధా.. రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై గ్రాండ్ విక్టరీ..!
ఐపీఎల్-2023లో 42వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ముంబైకి 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై తరఫున టిమ్ డేవిడ్ చివరి ఓవర్లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముంబై ఖాతాలో వేశాడు.
ఐపీఎల్-2023లో 42వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్(Rajasthan) బ్యాట్స్‌మెన్ రాణించడంతో ముంబై(Mumbai)కి 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై తరఫున టిమ్ డేవిడ్(Tim David) చివరి ఓవర్లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముంబై ఖాతాలో వేశాడు.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(Ishan Kishan), కెమెరూన్ గ్రీన్(Cameron Green)లు ఆదుకునేందుకు ప్రయత్నించారు. ఇషాన్ 23 బంతుల్లో 28 పరుగులు, గ్రీన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) గ్రౌండ్ అంతా స్ట్రోక్స్ కొట్టాడు. 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. చివర్లో తిలక్ వర్మ(Tilak Varma), టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జాసన్ హోల్డర్(Jason Holder) వేసిన చివరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ముంబైకి విజయాన్ని అంధించాడు. టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఓ జట్టు 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ రికార్డును ముంబై జట్టు తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్(Jos Buttler) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దేవదత్ పెద్దికల్ 2 పరుగులు, జాసన్ హోల్డర్ 11 పరుగులు త్వరగా పెవిలియన్ చేరారు. అయితే యశస్వి జైస్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ.. 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. అతని కారణంగానే ముంబైపై రాజస్థాన్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ముంబై ఇండియన్స్ తరఫున అర్షద్ ఖాన్(Arshad Khan) 3 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు. పీయూష్ చావ్లా(Piyush Chawla) 2 వికెట్లు, రిలే మెడెరిత్, జోఫ్రా ఆర్చర్ తలా ఒక వికెట్ తీశారు.