196-2 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరు వద్ద నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ పరుగుల వరద సాధించడమే లక్ష్యంగా

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యం సాధించింది. రాజ్‌కోట్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టులో భాగంగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆ జట్టును 39.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్‌ చేసి 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పరుగుల పరంగా టెస్టులలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, బుమ్రాలకు ఒక వికెట్‌ దక్కింది.

196-2 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరు వద్ద నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ పరుగుల వరద సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని వేగంగా ఆడింది. శుభ్‌మన్‌ గిల్‌ (91) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. మూడో రోజు చివర్లో వెన్నునొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వీ జైస్వాల్‌ (214 నాటౌట్‌) సెంచరీ చేశాడు. అతడికి తోడుగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (68 నాటౌట్‌) కూడా రాణించాడు. భారతజట్టు 430-4 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌.. ఇంగ్లండ్‌ ఎదుట 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు ఏ మాత్రం దూకుడుగా ఆడలేకపోయింది. జాక్‌క్రాలీ (11), బెన్ డ‌కెట్ (4), ఒలిపోప్ (3), జో రూట్ (7), జానీబెయిర్ స్టో (4), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (15), రెహాన్ అహ్మ‌ద్ (0) లు చేసి అవుట్ అవ్వడంతో 50 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది ఇంగ్లండ్. ఈ ద‌శ‌లో వికెట్ కీప‌ర్ బెన్‌ఫోక్స్ (16), టామ్ హార్డ్లీ(16) కలిసి 100 పరుగుల మార్క్ ను దాటించారు. ఇంగ్లండ్‌ చివరికి 122 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Updated On 18 Feb 2024 6:42 AM GMT
Yagnik

Yagnik

Next Story