నిరాశాజనకమైన ప్రపంచ కప్ ఫైనల్ జరిగి నెల గడిచిపోయింది. మ‌ధ్య‌లో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాల‌పై సిరీస్‌లు గెలిచినా.. ప్ర‌పంచ క‌ప్ ఓడిపోయామ‌నే బాధ అలాగే ఉంది

నిరాశాజనకమైన ప్రపంచ కప్ ఫైనల్(World Cup Final) జరిగి నెల గడిచిపోయింది. మ‌ధ్య‌లో ఆస్ట్రేలియా(Australia), ద‌క్షిణాఫ్రికా(Southafrica)ల‌పై సిరీస్‌లు గెలిచినా.. ప్ర‌పంచ క‌ప్(World Cup) ఓడిపోయామ‌నే బాధ అలాగే ఉంది. ఇలాంటి మూడ్‌ను పోగ‌ట్టాలంటే ఓ అద్భుత‌మైన విజ‌యం టీమిండియా(Teamindia) సొంతం చేసుకోవాల్సి ఉంది. రోహిత్ శర్మ(Rohit Sharma) సార‌ధ్యంలోని టెస్టు జ‌ట్టు అటువంటి విజ‌యానికి అడుగుదూరంలో ఉంది. బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ రేప‌టి ప్రారంభ‌మ‌వ‌నుంది.

భారత క్రికెట్ జట్టు 31 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను గెలవలేదు. కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న కోహ్లీ(Kohli), రోహిత్(Rohit) ఈ అప్ర‌తిష్ట నుంచి టీమిండియాను బ‌య‌ట‌ప‌డేయాల‌నుకుంటున్నారు. 1992లో దక్షిణాఫ్రికాలో జ‌రిగిన సిరీస్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ దక్షిణాఫ్రికా గ‌డ్డపై మ‌రో సిరీస్ గెల‌వ‌లేదు.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు మొత్తం 42 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్ 15, దక్షిణాఫ్రికా 17 టెస్టుల్లో విజయం సాధించాయి. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రెండు జట్ల మధ్య విజ‌యాల్లో పెద్దగా తేడా లేదు. అయితే దక్షిణాఫ్రికాలో భారత్‌ రికార్డు పేలవంగా ఉంది. ఆఫ్రికన్ గడ్డపై టీమిండియా 23 టెస్టులు ఆడి నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల‌లో ఓటమి చవిచూసింది. ఏడు టెస్టులు డ్రాగా ముగిశాయి.

భారత్ చివరిసారిగా 2021లో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టులో విజయం సాధించింది. ఆ మ్యాచ్ కూడా సెంచూరియన్‌లోనే జరిగింది. సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టులు జరగ్గా.. మూడింటిలోనూ ఫలితాలు వచ్చాయి. రెండింట్లో భారత జట్టు ఓడిపోగా.. ఒకదానిలో టీమిండియా విజయం సాధించింది. ఈ నేప‌థ్యంలో 31 ఏళ్ల క‌ల‌ను టీమిండియా నిజం చేయాల‌ని అభిమానులు భావిస్తున్నారు.

Updated On 24 Dec 2023 10:21 PM GMT
Yagnik

Yagnik

Next Story