టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని ఖరీదైన బాంద్రాలో

టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని ఖరీదైన బాంద్రాలో రూ. 5.38 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. నిర్మాణంలో ఉన్న టెన్ బీకేసీ ప్రాజెక్ట్‌లో 1100 చదరపు అడుగులు కలిగిన ఫ్లాట్‌ను జైస్వాల్ కొనుగోలు చేసినట్టు ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. గత నెల 7న జైస్వాల్ పేరున రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది.

22 ఏళ్ల జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలు బాదాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 109.00 సగటుతో 545 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక యశస్వి జైస్వాల్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ 14ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీలు బాదడం ద్వారా జైస్వాల్‌ (699 పాయింట్లు) తన ర్యాంకింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ (752) ఏడో ర్యాంక్‌లో ఉండగా.. రోహిత్‌శర్మ (731) 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

Updated On 22 Feb 2024 1:24 AM GMT
Yagnik

Yagnik

Next Story