సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగేలేదనుకున్న భారత్‌కు(India) న్యూజిలాండ్‌(New zealand) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.

సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగేలేదనుకున్న భారత్‌కు(India) న్యూజిలాండ్‌(New zealand) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. బెంగళూరులో పదునైన పేస్‌తో టీమ్‌ఇండియాకు ఘోర ఓటమి రుచి చూపించిన కివీస్‌(Kivis).. పుణె(Pune) టెస్టులో కూడా భారత్‌ను ఓడించింది. 359 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన భారత్.. 245 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌(Mitchell Santner) 13 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను నడ్డి విరిచాడు. స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ(kohli) సింగిల్‌ డిజిట్‌తో భారంగా పెవిలియన్‌ చేరగా, మిగతా వాళ్లు అంతో ఇంతో ఫర్వాలేదనిపించారు. కివీస్‌ స్పిన్నర్లు రెచ్చిపోయిన పిచ్‌పై భారత స్పిన్నర్లు ప్రభావం చూపలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన రెండు టెస్టుల్లో భారత్‌ ఓడిపోయింది. దీంతో 2-0తో ఇప్పటికే సిరీస్ కివీస్‌ చేతికి వెళ్లిపోయింది. పుష్కరకాలం తర్వాత టీమిండియా స్వదేశంలో సిరీస్‌ కోల్పోయి చరిత్రను మూటగట్టుకుంది.

Eha Tv

Eha Tv

Next Story