T20 Series : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియాను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు కెప్టెన్సీ అప్పగించారు. ఇక శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు మ్యాచ్‌లలో జట్టులోకి వస్తాడు.
ఆస్ట్రేలియా(Australia)తో జరిగే టీ20 సిరీస్(T20 Series)కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా(Teamindia)ను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav)కు జట్టు కెప్టెన్సీ అప్పగించారు. ఇక శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) చివరి రెండు మ్యాచ్‌లలో జట్టులోకి వస్తాడు. ఆ రెండు మ్యాచ్‌లకు అతడు వైస్ కెప్టెన్ పాత్రను కూడా పోషిస్తాడు. ఈ సిరీస్‌లో భారత్ ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్ జట్టులో ఆడిన ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం కల్పించారు. ఇందులో కెప్టెన్ సూర్యకుమార్ ఒక్కడే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతడితో పాటు తొలి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్(Ishan Kishan) కూడా జట్టులో ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా గాయపడటంతో ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ(Prasiddh Krishna)కు కూడా ఈ సిరీస్‌లో అవకాశం లభించింది. అయితే వరల్డ్ కప్ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీల సాయంతో 500కు పైగా పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్.. సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లలో వైస్ కెప్టెన్‌గా ఆడనున్నాడు.
గత కొన్ని టీ20 సిరీస్‌లలో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. నాలుగో మ్యాచ్‌లో మూడు బంతులు వేసిన తర్వాత అతడు ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు అతడు తిరిగి టీమిండియాలోకి వస్తాడని భావిస్తున్నారు.
హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రుతురాజ్ సారథ్యంలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. అతడిని తొలి మూడు టీ20లకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆసియా క్రీడల్లో ఆడిన ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మలకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.