ఓ ప‌క్క హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుండ‌గా.. మ‌రోప‌క్క నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్‌లో రంజీ ట్రోఫీ నాలుగో మ్యాచ్ జరుగుతుంది.

ఓ ప‌క్క హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్(India)-ఇంగ్లండ్(England) జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుండ‌గా.. మ‌రోప‌క్క నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్‌లో రంజీ ట్రోఫీ(Ranji Trophy) నాలుగో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(Tanmay Agarwal) 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ కావ‌డం విశేషం.

తన్మయ్ 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 ప‌రుగులు చేశాడు. రాహుల్ సింగ్‌(Rahul Singh)తో కలిసి అత‌డు తొలి వికెట్‌కు 449 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అతడు 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ(Triple Century) పూర్తి చేశాడు. ఇది ఫస్ట్ క్లాస్(First Class) క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. 28 ఏళ్ల తన్మయ్‌ బోర్డర్, వెస్ట్రన్ ప్రావిన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 191 పరుగులతో ట్రిపుల్ సెంచరీ కొట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరైస్‌ను రికార్డ్‌ను అధిగ‌మించాడు. తన్మయ్‌ తన ఇన్నింగ్సులో 21 సిక్సర్లు కొట్టాడు. త‌ద్వారా ఒక ఇన్నింగ్సులో రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

తన్మయ్ భారత్ తరఫున అత్యంత వేగవంతమైన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ చేసిన‌ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. 119 బంతులు ఎదుర్కొని డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే. తన్మయ్‌ 160 బంతుల్లో అజేయంగా 323 పరుగులు చేయగా.. హైదరాబాద్ 48 ఓవ‌ర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు చేసింది.

Updated On 26 Jan 2024 9:29 PM GMT
Yagnik

Yagnik

Next Story