India Vs West Indies 2nd Test : విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో టీమిండియా
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడోరోజైన శనివారం వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. దీంతో ఆదివారం అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది.
భారత్, వెస్టిండీస్(India Vs West Indies) జట్ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్(Port of Spain)లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో(Queens Park Oval Stadium) రెండో టెస్ట్ మ్యాచ్(Second Test Match)) జరుగుతున్న విషయం తెలిసిందే. మూడోరోజైన శనివారం వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. దీంతో ఆదివారం అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. బదులుగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసి ఆలౌటైంది. సిరాజ్(Siraj) ఐదు వికెట్లు, జడేజా(Jadeja), ముఖేష్(Mukesh) తలా రెండు, అశ్విన్(Ashwin) ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 181/2 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రోహిత్(Rohit), ఇషాన్ కిషన్(Ishan Kishan)లు అర్ధ సెంచరీలు చేశారు. దీంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
నాలుగో రోజు ఆటకు కూడా వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా రెండో సెషన్ ఆట దాదాపుగా కొట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐదో రోజు కూడా అరగంట ముందుగానే ఆట ప్రారంభం కానుంది. విజయానికి భారత్ 98 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీయాల్సివుంది. వెస్టిండీస్ విజయం సాధించాలంటే 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను 255 పరుగుల వద్ద ముగించింది. దీంతో టీమిండియా 183 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 181 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి మొత్తం 364 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో వెస్టిండీస్ ఎదుట 365 పరుగుల లక్ష్యం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండు వికెట్లకు 76 పరుగులు చేసింది. తేజ్ నారయణ్(24), బ్లాక్‌వుడ్(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.