2024 టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు 46వ మ్యాచ్ అమెరికా, వెస్టిండీస్ మధ్య జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 10 వికెట్లకు 128 పరుగులు చేసింది.

2024 టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు 46వ మ్యాచ్ అమెరికా, వెస్టిండీస్ మధ్య జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 10 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంత‌రం షాయ్ హోప్ అజేయ ఇన్నింగ్స్ 82 పరుగుల సాయంతో వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే 130 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వెస్టిండీస్ 24న దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌ ఘోర పరాజయం పాలైంది. ఈ విజయంతో గ్రూప్-2లో వెస్టిండీస్ రెండు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టు ఒక్క విజయంతో మూడో స్థానానికి పడిపోయింది. ఒక్క విజయం కూడా సాధించని అమెరికా జట్టు నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు శుభారంభం లభించింది. షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్‌లు తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంత‌రం చార్లెస్‌(15) ఏడో ఓవర్ చివరి బంతికి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత‌ పూరన్ 12 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు, హోప్ నాలుగు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేయ‌డంతో చేయ‌డంతో 11 ఓవ‌ర్లోనే మ్యాచ్ ముగిసింది.

Eha Tv

Eha Tv

Next Story