Mumbai Indians vs Gujarat Titans : రషీద్ ఖాన్ పోరాటం వృధా.. గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఏడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 218 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జట్టు 191 పరుగులు చేసి 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Suryakumar’s maiden hundred hands Mumbai 27-run win against Gujarat
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 27 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఓడించి ఏడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై(Mumbai) జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 218 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్(Gujarat) జట్టు 191 పరుగులు చేసి 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) (103) సెంచరీతో రెచ్చిపోవడంతో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ తరఫున రషీద్ ఖాన్(Rashid Khan) అజేయంగా 79 పరుగులు చేశాడు. కానీ అతనికి మరో బ్యాట్స్‌మెన్ మద్దతు లభించలేదు. దీంతో రషీద్ ఇన్నింగ్సు జట్టును గెలిపించలేకపోయింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్‌తో పాటు రోహిత్ శర్మ(Rohit Sharma) 29, ఇషాన్ కిషన్(Ishan Kishan) 31, విష్ణు వినోద్(Vishnu Vinod) 30 పరుగులు చేశారు. గుజరాత్ తరఫున రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు, మోహిత్ శర్మ ఒక వికెట్ తీశారు. గుజరాత్ తరఫున రషీద్ ఖాన్(79) కాకుండా డేవిడ్ మిల్లర్(david Miller) 41, విజయ్ శంకర్(Vijay Shankar) 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వల్ మూడు వికెట్లు పడగొట్టాడు. పీయూష్ చావ్లా(Piyush Chawla), కుమార్ కార్తికేయ(Kumar Karthikeya) చెరో రెండు వికెట్లు తీశారు.
