Mumbai Indians won by 6 wkts : సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్.. ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మార్చుకుంది.

Suryakumar Yadav’s 35-ball 83 help Mumbai chase 200 in 16.3 overs
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Banglore)ను ఓడించి ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ముంబై జట్టు(Mumbai Indians) ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఆర్‌సీబీ(RCB) ప్లేఆఫ్(Playoff) ఆశలు సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 199 పరుగులు చేసింది. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత ఆర్‌సీబీ తరుపున కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis), గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) అద్భుతమైన అర్ధ సెంచరీలు చేశారు. ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేసారు. కానీ వారి కృషి ఫలించలేదు. ముంబై బౌలర్లలో బెహరీన్ డార్ఫ్ మూడు వికెట్లు పడగట్టగా.. గ్రీన్, జోర్డాన్, కార్తికేయ తలో వికెట్ తీశారు. ఛేజింగ్‌లో ముంబై తరుపున ఇషాన్ కిషన్(Ishan Kishan) (42), సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav) (83), నెహాల్ వధేరా(Nehal Wadhera) (52) వరుస సుడిగాలి ఇన్నింగ్స్‌లు ముంబైకి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ బౌలర్లలో వైశాక్ విజయ్ కుమార్(Vyshak Vijay Kumar), హసరంగ(Wanidu Hasaranga) తలా రెండు వికెట్లు పడగొట్టారు.
