Surya Kumar Yadav : వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం..
ఐపీఎల్ 2023 57వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి సూర్య బ్యాట్ నుంచి పిడుగులు రాలాయి. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ(103) సాధించాడు.

Suryakumar Yadav continues great run of form, smashes maiden IPL century in MI’s clash vs GT
ఐపీఎల్ 2023 57వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్లు తలపడుతున్నాయి. ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఈ మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి సూర్య బ్యాట్ నుంచి పిడుగులు రాలాయి. తద్వారా ఐపీఎల్ చరిత్ర(IPL History)లో తొలి సెంచరీ(103) సాధించాడు. అంతకుముందు అంతర్జాతీయ టీ20లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 103 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ సృష్టించాడు. సూర్య గత ఐదు మ్యాచ్‌ల్లో 3 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఐదు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇంతకు ముందు ఏ జట్టు కూడా ఒక సీజన్‌లో ఐదుసార్లు ఈ ఘనత సాధించలేదు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.
