T20 World Cup : రాణించిన బౌలర్లు.. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ విక్టరీ
గ్రూప్ దశలో ఉన్న జోరును కొనసాగించిన భారత జట్టు సూపర్‌ఎయిట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
గ్రూప్ దశలో ఉన్న జోరును కొనసాగించిన భారత జట్టు సూపర్‌ఎయిట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్ ఎయిట్ దశ గ్రూప్ 1 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ను భారత బౌలర్లు 134 పరుగులకు కట్టడి చేశారు. బుమ్రా, అర్ష్‌దీప్ చెరో మూడు వికెట్లు తీశారు.
ఆఫ్ఘనిస్థాన్ తరఫున అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అత్యధికంగా 26 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్ల నుంచి శుభారంభం లభించక వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు రాణించి స్కోరును కాపాడుకోవడంలో సఫలమయ్యారు. శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ విజయంతో సూపర్ ఎయిట్ దశలో గ్రూప్ 1లో భారత్ రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.