ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సన్ రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 1, టి.నటరాజన్ 1 వికెట్ తీశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురెల్ 56 (నాటౌట్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 మాత్రమే ఆకట్టుకున్నారు. ఓపెనర్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (10), కెప్టెన్ సంజు శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), రవిచంద్రన్ అశ్విన్ (0), షిమ్రోన్ హెట్మెయర్ (4), రోమాన్ పావెల్ (6) విఫలమవ్వడం సన్ రైజర్స్ కు కలిసొచ్చింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్లాసెన్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి సందీప్ శర్మ వేసిన యార్కర్ కు బౌల్డయ్యాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34, రాహుల్ త్రిపాఠి 37 పరుగులతో రాణించారు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ 18 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (12), ఐడెన్ మార్ క్రమ్ (1), నితీశ్ రెడ్డి (5), అబ్దుల్ సమద్ (0) విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేష్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. ఈ ఆదివారం చెన్నైలో కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

Updated On 24 May 2024 9:00 PM GMT
Yagnik

Yagnik

Next Story